హాలీవుడ్ సెక్సీతార మార్లిన్ మన్రో కథాంశంతో ‘హీరోయిన్’లో ఐష్
హాలీవుడ్ అందాలతారగా, సెక్సీ తారగా పేరు తెచ్చుకున్న మార్లిన్ మన్రో గురించి సినీప్రియులందరికీ తెలుసు. నటిగా వెండితెరపై ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో, ఆమె నిజజీవితం కూడా అంతటి వివాదాలమయంగా నిలిచింది. 36 ఏళ్ల పిన్న వయసులో మార్లిన్ ఆత్మహత్య చేసుకుందని వార్తలొచ్చినప్పటికీ, ఆమె మరణం ఇప్పటికీ ఓ మిస్టరీయే! ఇప్పుడామె కథను బాలీవుడ్ తెరకు ఎక్కిస్తున్నాడు ప్రముఖ దర్శకుడు మాధుర్ బండార్కర్.
ఇటువంటి కథలకు వెండితెర రూపాన్నివ్వడంలో ఆయన నిష్ణాతుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఇందులో హీరోయిన్ గా నటించమని మొదట కరీనా కపూర్ ని అడిగాడు. అయితే, ఆమె ఆసక్తి చూపకపోవడంతో ఐశ్వర్యా రాయ్ ని సంప్రదించాడు. ఆమె ఈ సినిమా చేయడానికి వెంటనే అంగీకరించింది. ఈ సినిమాకి 'హీరోయిన్' అనే టైటిల్ పెడుతున్నారు. మరో పక్క బాలీవుడ్ లో ఇప్పటికే, మన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా 'డర్టీ పిక్చర్' పేరుతో విద్యాబాలన్ హీరోయిన్ గా మరో సినిమా రూపొందుతుండడం విశేషం.


Click it and Unblock the Notifications











