»   » కాన్స్ ఐశ్వర్యరాయ్ కూతురుతో ఇలా...(ఫోటోలు)

కాన్స్ ఐశ్వర్యరాయ్ కూతురుతో ఇలా...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ ఇటీవల ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లకు హాజరైన సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత చాలా బరువు పెరిగి పోయిన ఐశ్వర్యరాయ్ ఈ ఫెస్టివల్‌లో తన అందంతో అందరినీ ఆశ్చర్యపరించింది. గతంలోకంటే చాలా బరువు తగ్గి, స్లిమ్‌గా సెక్సీగా దర్శనమివ్వడమే ఇందుకు కారణం.

తాజాగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగియడంతో ఐశ్వర్యరాయ్ ఇండియాకి తిరుగు ప్రయాణం అయ్యారు. తన కూతురు ఆరాధ్యతో కలిసి నైస్ ఎయిర్ పోర్టుకు వచ్చిన సందర్భంగా ఐశ్వర్యరాయ్ ఫోటోగ్రాఫర్ల కంట పడింది. నలుపు రంగం డ్రెస్సులో ఐశ్వర్యరాయ్ లక్ అదిరిపోయింది.

ఐష్ కూతురు ఆరాధ్య కూడా క్యూట్‌ లుక్‌తో బుల్లి బుల్లి అడుగులు వేస్తూ ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

నైస్ ఎయిర్ పోర్టులో ఐశ్వర్యరాయ్

నైస్ ఎయిర్ పోర్టులో ఐశ్వర్యరాయ్

67వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగియడంతో ఐశ్వర్యరాయ్ ఇండియాకి ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురుతో కనిపించింది.

సెక్సీ లుక్

సెక్సీ లుక్

నైస్ ఎయిర్ పోర్టులో నలుపురంగు డ్రెస్సులో దర్శనమిచ్చిన ఐశ్వర్యరాయ్ హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఆకట్టుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడొచ్చు.

తల్లీ కూతుళ్లు...

తల్లీ కూతుళ్లు...

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఐశ్వర్యరాయ్ తన తల్లి బృందా రాయ్, కూతురు ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు. ఆ ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

భర్త అభిషేక్ బచ్చన్‌తో..

భర్త అభిషేక్ బచ్చన్‌తో..

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్.

ఫస్ట్ అప్పియరెన్స్

ఫస్ట్ అప్పియరెన్స్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ రెడ్ కార్పెట్ ఫస్ట్ అప్పియరెన్స్‌లో ఐశ్వర్యరాయ్ ఇలా అదిరిపోయే లుక్‌తో కనిపించారు.

సెకండ్ అప్పియరెన్స్

సెకండ్ అప్పియరెన్స్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ సెకండ్ అప్పియరెన్స్‌లో ఐశ్వర్యరాయ్ ఇలా తన అందచందాలతో ఆకట్టుకున్నారు.

English summary
Seems like Aishwarya Rai Bachchan is proving time and again that she is back to her sensuous and curvy figure. The international diva who has just wowed us with her three back to back Cannes 2014 appearances has now returned from the French Riviera.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu