తెలుగులో సూపర్ హిట్టయిన 'అరుధంతి' సినిమాని హిందీలోకి డబ్బింగ్ చేయటం కన్నా రీమేక్ చేయటం బెటరని నిర్మాత శ్యామ్ ప్రసాద్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన ఐశ్వర్యారాయ్ ని ఎంచుకని సంప్రదిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. ఇక అనూష్క ...బాలీవుడ్ కి కొత్త కావటం, అందులోనూ ఈ మధ్య రబ్ నే బనానే జోడి చిత్రం ద్వారా పరిచయమైన హీరోయిన్ పేరు కూడా అనుష్క కావటం కన్ఫూజన్ గురి అవుతుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఐశ్వర్యతో చేయటం ద్వారా అంతర్జాతీయంగా లభించే ప్రచారం, వ్యాపారం భారీ ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. అంటే అన్నీ కలిసివస్తే అరుంధతి గా ఐశ్వర్య మన ముందు మరో సారి సాక్షాత్కరిస్తుంది.