అందానికే అందం నీవే సుందరి...(ఐశ్వర్యరాయ్ ఫోటోలు)
న్యూఢిల్లీ: హీరోయిన్ ఐశ్వర్యారయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నా...అందం విషయంలో మాత్రం తనకు ఎవరూ సాటిరారు అని నిరూపించుకుంటోంది. సినిమాలు చేయక పోయినా....పలు వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులకు కనువిందు చేస్తుంది. కల్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె తాజాగా న్యూ ఢిల్లీలో మూడో షోరూం ఓపెన్ చేసారు.
ఈ షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్‌తో దర్శనమిచ్చింది. బ్లాక్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకున్న ఐశ్వర్యరాయ్ చుంకీ గోల్డ్ జ్యెవెల్లరీ ధరించి అందానికే అందం నీవే సుందరి అనే విధంగా ఆకట్టుకుంది. ఐశ్వర్యరాయ్‌ని చూసేందుకు అభిమానులు భారీగా తరలి వచ్చారు.
కల్యాణ్ జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభోత్సవానికి సంబంధించిన ఐశ్వర్యరాయ్ ఫోటోలు స్లైడ్ షోలో.....

జ్యువెలరీ షోరూం ప్రారంభిస్తున్న ఐశ్వర్యరాయ్
మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాయ్....తాను బ్యాండ్ అంబాసిడర్‌గా కల్యాణ్ జ్యెవెల్లర్స్ మూడో షోరూంను న్యూ ఢిల్లీలో ప్రారంభించారు.

ఐశ్వర్యరాయ్
ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ...కల్యాణ్ జ్యెవెల్లర్స్ వారు ఎంతో నాణ్యమైన ఆభరణాలు అందిస్తున్నారని, విభిన్నమైన డిజైన్లు, నాణ్యతకు, మన్నికకు మారు పేరైన ఈ సంస్థ తరుపున ప్రచారం చేయడం ఆనందం ఉందని తెలిపారు.

ఐశ్వర్యరాయ్ లుక్ సూపర్
కల్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ కొత్త షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది.

బ్యూటీ క్వీన్
బ్లాక్ కలర్ అనార్కలి డ్రెస్, చుంకీ గోల్డ్ జ్యువెల్లరీ ధరించిన ఐశ్వర్యరాయ్....బ్యూటీ క్వీన్‌లా మెరిసి పోయింది.

వ్యాపార ప్రకటనల్లో బిజీ
ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ సినిమాలు ఏమీ చేయక పోయినా...పలు వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ, వాటి తరుపున ప్రచారం చేస్తూ బిజీగా గడుపుతున్నారు.

త్వరలోనే...
హీరోయిన్ ఐశ్వర్యరాయ్ త్వరలోనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అందుకు సంబంధించిన విషయాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.


Click it and Unblock the Notifications











