'విలన్' సరసలాడుతున్న ఐశ్వర్య రాయ్!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'రావణ్". తెలుగులో ఈ చిత్రానికి టైటిల్ 'విలన్" గా నిర్ణయించారు. మూడు వెర్షన్స్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని సమాచారం. ఈ చిత్రం అన్నీ వెర్సన్స్ లో ఐశ్శర్య రాయ్ ప్రముఖ పాత్ర పోషిస్తుండగా..అభిషేక్ బచ్చన్, విక్రమ్ హీరోలు మాత్రం తమకు ఏ వెర్షన్ లో ఏ పాత్ర వస్తే ఆ పాత్ర కు వందశాతం న్యాయం చేసారట. అయితే ఐశ్వర్యరాయ్ ప్రక్కన నటిస్తున్న హీరో విక్రమ్ కి మాత్రం రకరకాలుగా ఉంటుందట.
'రావణ్" సినిమా సాంగ్సే కాదు. స్టిల్స్ కూడా బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఎఆర్ రహమాన్ స్వరపరిచిన ఆడియో హిందీలో పెద్ద సక్సెస్ కాగా..ఈ సినిమాకి సంబంధించిన స్టిల్స్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ చిత్ర రెండు వెర్షన్స్ లో అద్భుతమైన పాత్ర చేసానని ఆనందపడుతున్న విక్రమ్..ఐష్ ప్రక్కన మహాద్బుతంగా ఉందని చెప్పుతున్నాడట. అంతే కాదండోయ్ శృంగారభరిత భంగిమలలో ఐష్ ని చూసి ఐస్ అయిపోతున్న అభిమానులు ఇందులోని సరససన్నవేశాలను తెరపై చూసే రోజు కోసం ఆరాటపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











