2.0... ఐశ్వర్యరాయ్ గెస్ట్ రోల్‌పై శంకర్ క్లారిటీ!
రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'యంతిరన్'(రోబో) మూవీ అప్పట్లో సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో రజనీకి జోడీగా ఐశ్వర్యరాయ్ నటించింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా 2.0 వస్తున్న నేపథ్యంలో ఐశ్వర్యరాయ్ కూడా అతిథి పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు శంకర్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. 2.0 చిత్రంలో ఐశ్వర్యరాయ్ నటించ లేదని తెలిపారు. 'ఐశ్వర్యరాయ్ స్క్రిప్టులో భాగమే అయినప్పటికీ సినిమాలో ఆమె విజువల్ ప్రజన్స్ ఉండదని, ఆమెకు సంబంధించిన కొన్ని రిఫరెన్సులు ఉన్నప్పటికీ ఆమె నటించలేదు' అని శంకర్ స్పష్టం చేశారు.
తొలి భాగం 'యంతిరన్'లో ఐశ్వర్యరాయ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సినిమా కథ మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. ఆ సినిమాలో రోబో చిట్టి, ఐశ్వర్యరాయ్ మధ్య వచ్చే సన్నివేశాలు సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

2.0 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇండియాలో ఇప్పటివకే ఏ సినిమాకు లేనంతగా రూ. 570 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ రోల్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తీర్చిదిద్దడానికి 2150 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉపయోగించారు. 3000 మంది వి.ఎఫ్.ఎక్స్ టెక్నీషియన్స్.. 1000 టిపికల్ వి.ఎఫ్.ఎక్స్ షాట్ మేకర్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. త్రీడీ టేకింగ్, 4డీ సౌండింగ్ అనే కొత్త అనుభవాన్ని ప్రేక్షకులు ఫీల్ అవుతారు.
2.0 చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కలిసి ఇండియా వ్యాప్తంగా తొలి రోజు 10 వేల స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో దాదాపు 1500 వరకు 3డి స్క్రీన్లు ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











