ఐశ్వర్యరాయ్‌ని పబ్లిగ్గా ముద్దాడిన దర్శకుడు(ఫోటో)
మంబై : ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తెను ముద్దు పెట్టుకోవాలనే కోరిక ఉండే వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. ఆమెతో నటించే అవకాశం దక్కితే తప్ప ఆ కోరిక తీరడం దాదాపుగా అసాధ్యం. తాజాగా ఐశ్వర్యరాయ్‌ని ముద్దాడుతున్న వ్యక్తి ఫోటో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది.
అతను ఎవరో కాదు హాలీవుడ్ పరిశ్రమకు చెందిన దర్శకుడు జిమ్ సంజీరో. ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న L'Oreal అనే కాస్పొటిక్ ప్రొడక్ట్స్ కోసం చిత్రీకరించిన యాడ్‌కి ఆయన దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్‌ని ముద్దు పెట్టుకున్నాడు. ఈ ఫోటోను ఐశ్వర్యరాయే తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసింది. ఈ ఫోటోను చూసి ఆమె అభిమానులు అసూయ పడుతున్నారు.
అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడిన ఐశ్వర్యరాయ్ ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆమె మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందనే దానిపై సరైన సమాచారం లేకున్నా........రకరకాల పుకార్లు తరచూ షికార్లు చేస్తున్నాయి.
ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోందని, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'రామ్ లీలా' చిత్రంలో ఐటం సాంగు ద్వారా రీ ఎంట్రీ ఇస్తోందని బాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో 'రామ్ లీలా' దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పందించారు. ఐశ్వర్యరాయ్ తన సినిమాలో ఐటం సాంగు చేయడం లేదని స్పష్టం చేసారు.
ఇవన్నీ అధారం లేని రూమర్లే అంటూ సంజయ్ లీలా భన్సాలీ తేల్చి చెప్పారు. ఇలాంటివి నమ్మవద్దని సూచించారు. 'మొదటి సోనాక్షి సిన్హా అన్నారు, ఆ తర్వాత మాధురి దీక్షిత్ అన్నారు...ఇప్పుడు ఐశ్వర్యరాయ్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి విషయాలు ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదు' అంటూ దర్శక దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications












