»   » జజ్బా ప్రమోషన్స్: ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ (ఫోటోస్)

  జజ్బా ప్రమోషన్స్: ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ (ఫోటోస్)

  By Bojja Kumar

  హైదరాబాద్: ఐశ్వర్యరాయ్ ఒకప్పటి ప్రపంచ సుందరి. కానీ అమ్మడి వయసు 40 సంవత్సరాలు దాటినా ఇంకా అందాల సుందరిగానే గుర్తింపు పొందుతోంది. నాలుగు పదుల వయసులోనూ వన్నె తరగని అందం ఆమో సొంతం. ఐశ్వర్యరాయ్ ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో తెరకెక్కుతున్న జజ్బా చిత్రంలో నటిస్తోంది.

   

  చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఐశ్వర్యరాయ్ ‘జజ్బా' సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోంది. ఆఇందులో ఐశ్వర్యరాయ్, ఇర్ఫాన్ ఖాన్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయే విధంగా ఉంది. ఈ చిత్రంలో ఐష్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతోంది.

  ఇందులో ఆమె సింగిల్ మదర్, క్రిమిల్ లాయర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా పెర్ఫార్మెన్స్ పరంగా ఐశ్వర్యరాయ్ కి మంచి పేరు తెచ్చి పెడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

  అక్టోబర్ 9న ‘జజ్బా' సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. ప్రచార కార్యక్రమాల్లో ఐశ్వర్యరాయ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఐశ్వర్య రాయ్ సూపర్బ్ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

  సంజయ్-ఐష్

  సంజయ్-ఐష్

  జజ్బా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న దర్శకుడు సంజయ్ గుప్తా, ఐశ్వర్య రాయ్.

  లుక్ సూపర్బ్

  లుక్ సూపర్బ్

  సినిమా ప్రమోషన్స్‌లో ఐశ్వర్యరాయ్ లుక్ సూపర్బ్ అంటున్నారు అభిమానులు.

  ఐదేళ్ల తర్వాత

  ఐదేళ్ల తర్వాత

  దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారు.

  ఫ్యాన్ ఫాలోయింగ్

  ఫ్యాన్ ఫాలోయింగ్

  ఇంత కాలం సినిమాలకు దూరంగా ఉన్నా ఐశ్వర్యరాయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.

  క్రేజీ ఫ్యాన్స్

  క్రేజీ ఫ్యాన్స్

  ఐశ్వర్యరాయ్ కనబడగానే అభిమానులంతా విజిల్స్ వేస్తూ సందడి చేసారు. తమ సెల్ ఫోన్లలో ఆమెను ఫోటోలు తీయడానికి పోటీ పడ్డారు.

  ఐష్ పాత్ర..

  ఐష్ పాత్ర..

  జజ్బా సినిమాలో ఐశ్వర్యరాయ్ ఒక క్రిమినల్ లాయర్ పాత్రలో నటిస్తోంది.

  రీమేక్

  రీమేక్

  2007లో విడుదలైన కొరియన్ ఫిల్మ్ ‘సెవెన్ డేస్' ఆధారంగా సంజయ్ గుప్తా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

  అభిషేక్-ఐష్

  అభిషేక్-ఐష్

  ఈ సినిమా ఒప్పుకునేలా అభిషేక్ బచ్చన్ స్వయంగా ఐశ్వర్యరాయ్ ని కన్విన్స్ చేసాడట.

  విడుదల

  విడుదల

  జజ్బా చిత్రం అక్టోబర్ 9న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

  ఐష్ సినిమాలు

  ఐష్ సినిమాలు

  జజ్బా తర్వాత ఐశ్వర్యరాయ్ కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ‘యే దిల్ హై ముష్కిల్' చిత్రంలో నటిస్తోంది.

  Please Wait while comments are loading...

  Telugu Photos

  Go to : More Photos
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X