»   » ఫోటోలు : ఐశ్వర్యరాయ్ హాట్ లుక్

ఫోటోలు : ఐశ్వర్యరాయ్ హాట్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : అందాల సుందరి, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ మరోసారి హాట్ లుక్‌తో కనువిందు చేసింది. రియల్ ఎస్టేట్ గ్రూపు 'Lodha' సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆమె ఆ సంస్థ సెంట్రల్ ముంబైలో 17.5 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ప్రీమియం ప్రాజెక్ట్ 'ది పార్క్'ను ప్రారంభించారు. 'ది పార్క్' ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఐశ్వర్యరాయ్ హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా డిజైన్ చేసిన బ్లాక్ కలర్ డ్రెస్‌లో హాజరైన ఐశ్వర్యరాయ్ అందాల దేవతలా దర్శనం ఇచ్చింది. దీంతో మళ్లీ ఐశ్వర్యరాయ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందా? అనే చర్చ మొదలైంది. గత కొంత కాలంగా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీపై రకరకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి.

అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడిన ఐశ్వర్యరాయ్ ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరమైంది. ఆమె మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఎప్పుడు ఇస్తుందనే దానిపై సరైన సమాచారం లేకున్నా........రకరకాల పుకార్లు తరచూ షికార్లు చేస్తున్నాయి.

అబ్బా ఏమి అందం ఐశ్వర్య..!

అబ్బా ఏమి అందం ఐశ్వర్య..!

ఈ ఫోజులో ఐశ్వర్యరాయ్ అందచందాలు చూసిన వారు అబ్బా ఏమి అందం అనకుండా ఉండలేక పోతున్నారు. ‘ది పార్క్' ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ ఇలా బ్లాక్ హాట్ డ్రెస్సులో హాజరైంది.

ఏ కోణంలో చూసినా వన్నెతరగని అందం

ఏ కోణంలో చూసినా వన్నెతరగని అందం

ఐశ్వరాయ్‌కి సంబంధించిన ఫోటోలను ఇక్కడ చూడొచ్చు. ఆమెను ఏ కోణంలో చూసిన వన్నెతగ్గని ముద్ద మందారంలా, దివి నుంచి భువికి దిగి వచ్చిన అందాల దేవతాల ఉందని ఆమె అభిమానులు అంటున్నారు.

అభిషేక్ లోధాతో ఐశ్వర్యరాయ్

అభిషేక్ లోధాతో ఐశ్వర్యరాయ్

రియల్ ఎస్టేట్ సంస్థ లోధ గ్రూపు సంస్థ ఎండి అభిషేక్ లోధతో ఐశ్వర్యరాయ్ ఇలా ఫోటోలకు ఫోజులుఇచ్చారు. లోధ సంస్థ ముంబై సెంట్రల్లో కొత్తగా ప్రారంభించిన ‘ది పార్క్' ప్రిమియం ప్రాజెక్టును ఇటీవల ప్రారంభించారు.

ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్

ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్

రియల్ ఎస్టేట్ గ్రూపు ‘Lodha' సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఐశ్వర్యరాయ్ వ్యవహరిస్తున్నారు. ఆ సంస్థ సెంట్రల్ ముంబైలో 17.5 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ప్రీమియం ప్రాజెక్ట్ ‘ది పార్క్'

ది లోధ గ్రూపు

ది లోధ గ్రూపు

లోధ గ్రూపు ప్రారంభించిన ‘ది పార్క్' ప్రీమియం ప్రాజెక్టు ఆవిష్కరణ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక్కడ ఆమె ‘ది పార్క్' లోగో ఆవిష్కరించారు.

రామ్ లీలా

రామ్ లీలా

ఐశ్వర్యరాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతోందని, సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామ్ లీలా' చిత్రంలో ఐటం సాంగు ద్వారా రీ ఎంట్రీ ఇస్తోందని బాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఖండించి భన్సాలీ

ఖండించి భన్సాలీ

ఐశ్వర్యరాయ్ ఐటం సాంగ్ చేస్తోందని రూమర్లు మొదలు కావడంతో ‘రామ్ లీలా' దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ స్పందించారు. ఐశ్వర్యరాయ్ తన సినిమాలో ఐటం సాంగు చేయడం లేదని స్పష్టం చేసారు.

బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య

బ్రేక్ తీసుకున్న ఐశ్వర్య

అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడిన ఐశ్వర్యరాయ్ ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు దూరమైంది. అయితే ఆమె శాశ్వతంగా సినిమాలకు దూరం కాలేదని, త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనుందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

English summary
Bollywood actress Aishwarya Rai Bachchan has been roped in as the brand ambassador by the real estate group Lodha, for its 17.5-acre premium project The Park in central Mumbai's Worli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu