»   » వావ్...బంగారు గౌనులో ఐశ్వర్యరాయ్(ఫోటోలు)

వావ్...బంగారు గౌనులో ఐశ్వర్యరాయ్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కళ్యాణ్ జ్యువెలర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఆ సంస్థ కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూములను ఐశ్వర్యరాయ్ ఏమాత్రం అలుపు లేకుండా ప్రారంభిస్తూ వెలుతోంది.

కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారు ఇటీవల గుజరాత్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన షోరూంను ఐశ్వర్యరాయ్ ప్రారంభించారు. త్వరలో పంజాబ్‌లో కూడా ఆ సంస్థ మరో షోరూం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షోరూం కూడా ఐశ్వర్యరాయ్‌‌‌చే ప్రారంభింప చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మీడియా రిపోర్ట్స్ ప్రకారం పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో ఐశ్వర్యరాయ్ చే కళ్యాణ్ జ్యువెల్లర్స్ వారు 52వ షోరూం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 22న ఆమె ఇక్కడ షోరూం ప్రారంభించనున్నారు. గతంలో ఐశ్వర్యరాయ్ ప్రారంభించిన షోరూంలకు జనం భారీగా తరలి వచ్చారు. ఇది ముమ్మాటికీ ఆమె స్టార్ ఇమేజ్ ఫలితమే అని సంస్థ నిర్వాహకులు నమ్ముతున్నారు.

గతంలో ఐశ్వర్యరాయ్ ఈ సంస్థ కోసం ఒంటినిండా నగలు ధరించి సెక్సీగా యాడ్ పోస్టర్లో దర్శనం ఇచ్చింది. తాజాగా కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ విడుదల చేసిన ఫోటోలో ఐశ్వర్యరాయ్ పూర్తిగా బంగారు గాజులతో తయారు చేసిన డ్రెస్సులో దర్శనం ఇచ్చింది. ఈ ఫోటోలో ఆమె సెక్సీ లుక్ అభిమానుల మతి పోగొడుతోంది.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్

కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థ బ్యాంగిల్ ఉత్సవంలో భాగంగా ఈ బంగారు గాజులతో ప్రత్యేకంగా ఐశ్వర్యరాయ్ కోసం డ్రెస్ తయారు చేయించినట్లు స్పష్టం అవుతోంది. ఈ ఫోటోలో ఐశ్వర్యరాయ్ లుక్ అదిరింది కదూ..

కళ్యాణ్ జ్యువెల్లర్స్

కళ్యాణ్ జ్యువెల్లర్స్

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఇటీవల ఐశ్వర్యరాయ్ కళ్యాణ్ జ్యువెల్లర్స్ కొత్త షోరూం ప్రారంభించింది. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ ఫోటోల చూడొచ్చు.

ది లోధా

ది లోధా

ఐశ్వర్యరాయ్ కళ్యాణ్ జ్యువెల్లర్స్ సంస్థతో పాటు ఇతర సంస్థలకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. లోధా గ్రూపు సంస్థ సంబంధించిన యాడ్లో ఐశ్వర్యరాయ్ ఇలా స్టన్నింగ్ లుక్ తో దర్శనం ఇచ్చింది.

బ్యూటిఫుల్ లుక్

బ్యూటిఫుల్ లుక్

ఐశ్వర్యరాయ్ ఈ ఎరుపు రంగు డ్రెస్సులో ఎంతో అందంగా ఉంది. ఇది కూడా ఓ వ్యాపార ప్రకటనలో భాగంగా చిత్రీకరంచిన దృశ్యమే.

సినిమాలకు దూరమైనా తగ్గని ఫాలోయింగ్

సినిమాలకు దూరమైనా తగ్గని ఫాలోయింగ్

ఐశ్వర్యరాయ్ తన బిడ్డకు జన్మిచ్చిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఐశ్వర్యరాయ్ సినిమా రాక దాదాపు రెండు మూడేళ్ల అవుతోంది. అయినా సరే జనాల్లో ఆమెకు ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.

మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ..?

మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ..?

ఐశ్వర్యరాయ్ మళ్లీ బాలీవుడ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో అని ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం ఈ విషయమై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

English summary
Bollywood's most beautiful actress Aishwarya Rai Bachchan has been on a tireless jaunt inaugurating showrooms for Kalyan Jewellers across the nation. Ash, who is the brand ambassador of Kalyan Jewelers, had recently been to Gujarat to inaugurate the new showroom of Kaylan Jewelers. As per the latest reports, Ash will be soon flying to Punjab for the same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu