బరువు తగ్గి స్టన్నింగ్ హాట్ లుక్‌తో ఐష్
ముంబై: తల్లయిన తర్వాత బాగా లావెక్కి పోయిన అందాల తార ఐశ్వర్య రాయ్ మళ్లీ సినిమాల్లోకి రావాలనే ప్రయత్నంతో మళ్లీ నాజుకు తీగలా తయారవుతోంది. తాజాగా సౌతిండియాలోని ఓ ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్ ప్రింట్ యాడ్ కోసం దిగిన ఫోటో షూట్ విడుదలైంది. దీన్ని చూస్తుంటే ఐశ్వర్యరాయ్ మళ్లీ వెయిట్ తగ్గి హాట్ హాట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నట్లు ఉంది కదూ...
గత రెండు వారాల నుంచి సదరు జ్యువెల్లరీ కంపెనీ కోసం రూపొందిస్తున్న యాడ్ చిత్రీకరణలో పాల్గొంటోంది. గతంలోనే ఈయాడ్ చిత్రీకరించాలని భావించినా ఆమె గర్భం దాల్చడంలో వాయిదా పడిందట. కెమెరామెన్ కిరణ్ ఐశ్వర్యరాయ్ గురించి మాట్లాడుతూ ఆమె గర్బందాల్చక ముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే అందంగా ఉందని, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆమె గ్లామర్ ఏమాత్రం చెక్కు చెదరలేదని అంటున్నాడు.
ఆ మధ్య జరిగిన కేన్స్ ఫెస్టివల్ లోనూ ఐశ్వర్య రాయ్ స్టన్నింగ్ లుక్ తో దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. బేటి బి'కి జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. అయినా సరే త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. అయితే ఎవరి సినిమా ద్వారా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది? సెకండ్ ఇన్సింగ్స్ లో ఆమెతో నటించే తొలి హీరో ఎవరు? తదితర అంశాలు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యాయి.
తొలుత శ్రీరామ్ రాఘవన్'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ....సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న బాజీరావు మస్తానీ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతోందిన మరో ప్రచారం కూడా ఉంది. సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ టైటానిక్ చిత్రంలో హాట్ లేడీ కేట్ విన్ స్లెట్ సరసన నటించిన స్టార్ బిల్లీ జేన్‌తో ఐశ్వర్యరాయ్ నటించబోతోందనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఈ అందాల తార మళ్లీ తెరపై దర్శనం ఇచ్చేది ఎప్పుడో.. అభిమానుల ఆశ తీరేది ఎప్పుడో..?


Click it and Unblock the Notifications











