ఐశ్వర్య రాయ్ రీఎంట్రీ ఖరారు...డిటేల్స్
ఈ నేపథ్యంలో 'మసూమ్' సినిమా రీమేక్‌లో ఐశ్వర్య రాయ్ నటించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. దాదాపు 30 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. శేఖర్ కపూర్ రూపొందించిన ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, షబానా అజ్మి జంటగా నటించారు. ఇప్పుడు వారి పాత్రల్లో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ నటిస్తారని వార్తలొస్తున్నాయి.
హిమేష్ రేషమ్మియా ఈ చిత్రాన్ని తాజాగా నిర్మించబోతున్నారు. పాత చిత్రం నిర్మించిన చందా దత్, దేవీ దత్ నుంచి హిమేష్ రీమేక్ హక్కుల్ని కూడా పొందారు. గత ఏడాది 'చిట్టగ్యాంగ్' సినిమాను రూపొందించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న బెడోబ్రత పెయిన్ ప్రస్తుత 'మసూమ్'ను తెరకెక్కించబోతున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.
నిజానికి అభిషేక్ బచ్చన్‌తో పెళ్లయిన తరవాత ఐశ్వర్య రాయ్ సినిమాలకు దూరమవుతుందేమోనని ఆమె అభిమానులు నిరాశపడ్డారు. అయితే అనూహ్యంగా ఆమె పెళ్లి తరవాత కూడా నటించింది. అయితే ఆరాధ్య పుట్టిన తర్వాత ఆమె ఆలనా పాలన నిమిత్తం ఆమె నట జీవితానికి తాత్కాలికంగా ఫుల్ స్టాఫ్ పెట్టింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె రీ ఎంట్రీ ఇస్తూండటం ఆమె అభిమానులను ఆనందపరుస్తోంది.


Click it and Unblock the Notifications












