కవర్ పేజీకెక్కిన ఐష్ అందాలు...

ఐష్ ఫోటో సెషన్స్‌ను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫారూఖ్ ఛోటియా చేపట్టారు. జర్మనీకి ఫోటో సెషన్స్ కోసం వెళ్లిన ఐశ్వర్యారాయ్‌కు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇందులో భాగంగా, జర్మనీకి ఐష్ చేరుకోగానే అనారోగ్యం బారిన పడింది. దీనితో ఫోటో సెషన్ అక్టోబర్ సంచికకు వాయిదా పడింది. మరోవైపు... ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్, "వోగ్" మ్యాగజైన్ ఫ్యాషన్ డైరక్టర్ అయిన అనితా షరాఫ్ అడజానియా ఇటీవలే గర్భం ధరించింది. దీనితో ఆమె డెలివరీకి ముందే కాస్ట్యూమ్స్ డిజైన్ లండన్‌లోనే ముగించాలని ఐశ్వర్యారాయ్‌పై ఒత్తిడి పెరిగింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఐష్ "వోగ్" ఫోటో సెషన్ విజయవంతంగా పూర్తయింది.


Click it and Unblock the Notifications











