నలభయ్యేళ్ల వయసులోనూ నాజూకు ఐష్ (ఫోటోస్)
హైదరాబాద్: ఐశ్వర్యరాయ్ చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె పలు మేగజైన్ల కోసం హాట్ హాట్ ఫోటో షూట్లు ఇస్తూ బిజీ అయిపోయారు. తాజాగా ఐశ్వర్యరాయ్ వోగ్ మేగజైన్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తాజాగా విడుదలైన సంచికలో ఐశ్వర్యరాయ్ ఫోటోలు డిఫరెంట్ లుక్ తో ఉన్నాయి.
అసలు ఆమె ఐశ్వరాయ్ అవునా? కాదా? అనే రేంజిలో ఆమె గెటప్ ఉండటం గమనార్హం. బిడ్డ పుట్టిన తర్వాత లావెక్కిన ఐశ్వర్యరాయ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చాలా కష్టపడింది. తన ఫిజిక్ మరింత అందంగా మార్చుకునేందుకు శక్తిమేర శ్రమించింది. ఫలితంగా నలభై ఏళ్ల వయసులోనూ నాజూకు సుందరిలా తయారైంది.
ఐశ్వర్య రాయ్ వోగ్ మేగజైన్‌కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో.....

జబ్బా
దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆమె బాలీవుడ్ మూవీ ‘జబ్బా' సినిమాలో నటిస్తోంది. యాక్షన్, థ్రిలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభం అయింది.

ఐశ్వర్యరాయ్
ఈ సినిమా కోసం ఐశ్వర్యరాయ్ గత కొంతకాలంగా సన్నద్ధం అవుతోంది. సినిమాలో తాను చేయబోయే పాత్రకు తగిన విధంగా శరీరాకృతిని మలుచుకుంది.

యాక్షన్
ఇందులో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ నటిస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

హీరోయిన్ ఓరియెంటెడ్
ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తోంది. ఐశ్వర్యరాయ్ తో పాటు ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మి, అనుపమ్ ఖేర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వచ్చే ఏడాది
ఎస్సెల్ విజన్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వైట్ ఫాదర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

నాజూకు
తన ఫిజిక్ మరింత అందంగా మార్చుకునేందుకు శక్తిమేర శ్రమించింది. ఫలితంగా నలభై ఏళ్ల వయసులోనూ నాజూకు సుందరిలా తయారైంది.


Click it and Unblock the Notifications











