పతియే ప్రత్యక్ష దైవం: ఐశ్వర్య బచ్చన్
ఐశ్వర్యా పతి భక్తి ఏలా అంటారా? అందాల తారగా ఎన్ని ప్రశంషలు అందుకొన్నా, నటిగా ఎన్ని పేరు ప్రతిష్టలు సంపాదించుకొన్నా భారత స్రీలకు వివాహం అయిన తర్వాత భర్తే తల్లి, తండ్రి, గురవై స్త్రీ కి అండగా నిలుస్తాడు. అలాంటి భర్త కోసం భార్య సాంప్రదాయాన్ని పాటించే దిశలో అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఒకటి. 'కర్వాచౌత్" ఇదొక వ్రతం. పెళ్లయిన స్త్రీలు ఈ వ్రతం చేస్తే భర్తకి మంచిది. అందుకే ఐశ్వర్యరాయ్ ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఐష్ పెళ్లయినప్పటినుంచి ప్రతి ఏడాదీ ఉపవాసం ఉంటారు. కాకపోతే, ఆరోజు షూటింగ్ లో పాల్గొనకుండా ఇంటిపట్టున ఉంటారామె. ఈ సారి అలా కుదరలేదు. పుణేలో మణిరత్నం రూపొందిస్తున్న 'రావాణ్" చిత్రం షూటింగ్ లో పాల్గొనాల్పిన వచ్చింది. అభిషేక్ బచ్చన్ ఎంత ప్రతిమలాడినా తను దీక్షను మానలేదట.
ఆ రోజంతా ఆహారం మాత్రమే కాదు పచ్చి మంచి నీళ్టు కూడా ఆమె ముట్టుకోలేదు. ఇంత కఠినమైన ఉపవాసం ఆచరించడంవల్ల భర్త ఆరోగ్యం బాగుంటుందని చరిత్ర చెబుతుండటంవల్లే ఐష్ ఈ వ్రతాన్ని చేపట్టారట. ఐష్ ఒక మోడర్న్ గా కనిపిస్తున్నప్పటికీ ఆమె మనసు మాత్రం సాంప్రదాయబద్దంగా ఉందని చెప్పడానికి ఈ సంఘలనను ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. భర్త గారి కోసం భార్య ఉపవాసం చేస్తే భర్తను సంతోషపెట్టినప్పటికీ, భర్తగారు మాత్రం ఆమె కడుపు మాడ్చుకొన్నందుకు బాధ పడుతున్నాడట. ఈ జంటకి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్" అని కితాబు ఇవ్వొచ్చు.


Click it and Unblock the Notifications











