57 గెటప్‌ లలో ఐశ్వర్య

By Staff

Aishwarya Rai
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా చేస్తున్న చిత్రంలో ఐశ్వర్యారాయ్ సుమారు 57 గెటప్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే ఒక పాటలో ఆమె మెక్సికన్‌ గిరిజన యువతిగా కూడా నటించి యువతరాన్ని ఉర్రూతలూగించనున్నారు. ఇందు కోసం కాస్ట్యూమ్‌ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్‌ రూపొందించినట్లు తెలుస్తోంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రపంచ ప్రఖ్యాత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు.

అలాగే రజనీకాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా శంకర్ రూపొందిస్తున్న రొబొ(Endhiran) సినిమా గురించి కొంత విశ్వసనీయ సమాచారం బయిటకు వచ్చింది. వాటిని బట్టి ఈ సినిమాలో రజనీకాంత్ డబుల్ (సైంటిస్ట్, రొబొ) పాత్రలలో కనపడనున్నారు. ఈ సినిమా కథ మొత్తం రొబొ తయారు చేయటానికి రజనీకాంత్ ని ఏ పరిస్ధితులు ప్రేరేపించాయి..తయారైన రొబో తో ఏ అనుబంధం పెంచుకుంటాడు..ఆ రొబో తో అతనేం సాధించాడు అన్న కోణంలో సాగుతుంది.

కధ మొత్తం 2200 AD లో జరుగుతుంది.అప్పుడు రజనీకాంత్ ఓ ఫేమస్ సైంటిస్టు. ఐశ్వర్యారాయ్ తో పిచ్చి ప్రేమలో ఉంటాడు. బెస్ట్ సైంటిస్ట్ అవార్డ్ పొందిన అతనికి ప్రభుత్వం ఓ ముఖ్యమైన పని అప్పచెబుతుంది. మానవ జీవితాన్నీ సౌకర్యవంతం చేయటానికి అవసరమైన రొబొలను తయారు చేయమని ఆదేశిస్తుంది. అయితే అసలు సమస్యంతా రజనీ..రొబో తయారు చేయటంతో వస్తుంది. అక్కడ నుండి కథ కొన్ని ఆసక్తి కరమైన మలుపులు తిరుగుతుంది.

ఇక కథలో ముఖ్యమైన మలుపు విలన్ పాత్రతో వస్తుంది. సైంటిస్ట్ రజనీ పేరు ప్రఖ్యాతలు చూసి ఓర్వలేక విలన్ ఆ తయారైన రొబొకి కొన్ని ముఖ్యమైన ప్రేమకు సంభందించిన పాస్ వర్డ్ మార్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. దాంతో ఆ రొబో తను తయారు అయిన కారణం వదిలేసి హీరోయిన్ తో ప్రేమలో పడుతుంది. అక్కడనుండి అది ఐశ్వర్య వెనుక పడుతూ సమస్యలు క్రియేట్ చేస్తుంది. చివరకు రజనీ తిరిగి ఎలా ఆ రొబో ను కంట్రోల్ లోకి తెచ్చుకుని తన ప్రేయసిని కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X