Don't Miss!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వర్మలాంటి వాళ్లను కెరీర్ లో చాలామందిని చూసానంటోంది
వర్మ మెసేజ్ గురించి నేను స్పందించను. ఎందుకంటే... నా కెరీర్లో ఇలాంటివి చాలా చూశాను అంటూ రామ్ గోపాల్ వర్మను కొట్టిపారేశింది ఐశ్వర్యారకాయ్. వర్మతో సర్కార్ రాజ్ చిత్రం చేసిన ఆమె గురించి వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో.... మోనాలిసాను మించిన వెయ్యి రెట్లు అందం ఐశ్వర్యారాయ్ సొంతం అని ట్వీట్ చేసారు. ఆయన ఏ అవసరముండి ఐశ్వర్యను ఐస్ చేద్దామనుకున్నారో తెలియదు కానీ ఈ కామెంట్ కి ఐశ్వర్య భర్త అబిషేక్ మాత్రం చాలా హ్యాపీ ఫీలయ్యి వర్మకు ఫోన్ చేసి ధాంక్స్ చెప్పారుట. అయితే ఈ తతంగం ఐష్ కు అస్సలు నచ్చలేదు. విశ్వసుందరిగా నా చరిత్ర మొత్తం గతం. ఇప్పుడు నేను ఓ వ్యక్తికి భార్యను. నా అందం అందరికీ నచ్చనవసరం లేదు. నా భర్తకు నచ్చితే చాలు. ఆయన ఎలా ఉన్నా నాకు నచ్చుతారు. నేను ఎలా ఉన్నా ఆయనకు నచ్చుతాను. ఇక వర్మ కామెంట్ గురించి అంటారా దాన్ని పట్టించుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే నా కెరీర్ మొత్తంలో ఇలాంటివి చాలా చూసాను అని ఆమె అంది. అసలే వర్మ తన భర్తను డిపార్టమెంట్ సినిమా లో నుంచి తీసేసి అవమాని్ంచాడని కుతకుతలాడుతున్న ఆమె ఈ కామెంట్ తో ఇంకా ఫైర్ అయిపోయింది.