వావ్...అందాల దేవతలా ఐశ్వర్యరాయ్ లుక్ (ఫోటోస్)
హైదరాబాద్: ఐశ్వర్యరాయ్ చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టైటిల్ ‘జజ్బా'. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కాన్స్-2015 ఫిల్మ్ ఫెస్టివల్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంజయ్ గుప్తాతో పాటు ఐశ్వర్యరాయ్ కూడా హాజరయ్యారు.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ‘జజ్బా' ఫస్ట్ లుక్ ఆవిష్కరణ సందర్భంగా ఫోటోకాల్ వద్ద ఆమె అద్భుతమైన వస్త్రాలంకరణతో అందాల దేవతలా దర్శనమిచ్చారు. డార్క్ బర్గుండే గౌను ధరించిన ఆమో భువి నుండి దివికి దిగివచ్చిన దేవతలా కనిపించింది. ఆమెను ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్లు పోటీ పడ్డారు.
ఫ్యాషన్ ప్రియులు, విమర్శకులు ఆమె లుక్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. 41 ఏళ్ల ఐశ్వర్యరాయ్...ఈ సందర్భంగా ‘జజ్బా' సినిమాలో తన పాత్ర గురించి చెప్పుకొచ్చారు. ఇందులో లాయర్ పాత్రలో నటిస్తున్నట్లు ఐశ్వర్యరాయ్ తెలిపారు. ఇందులో ఇంకా ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, అనుపమ్ ఖేర్ తదితరులు కూడా నటిస్తున్నారు.
స్లైడ్ షోలో ఫోటోలు...

ఫోటోకాల్ వద్ద ఐశ్వర్యరాయ్
బర్గుండే కలర్ గౌను ధరించిన ఐశ్వర్యరాయ్ ఫోటోకాల్ ఈవెంటు వద్ద ఇలా దర్శనమిచ్చారు.

ఫస్ట్ లుక్
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్ ‘జజ్బా' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

బ్యూటిఫుల్ లుక్
ఐశ్వర్యరాయ్ బ్యూటిఫుల్ లుక్ చూసి అంతా మంత్రముగ్దులయ్యారు.

41 ఏళ్ల వయసులోనూ...
41 ఏళ్ల వయసులోనూ ఐశ్వర్యరాయ్ ఇంత హాట్ లుక్ తో కనిపించడం విశేషం.

జజ్బా నటీనటులు
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగిన కార్యక్రమానికి ఈ చిత్ర నటీనటులు కూడా హాజరయ్యారు.

జజ్బా టీమ్
ఇర్ఫాన్ ఖాన్, షబానా అజ్మీ, అనుపమ్ ఖేర్ తదితరులతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని ఐశ్వర్యరాయ్ తెలిపారు.

ఐశ్వర్యరాయ్
ఇంటర్నేషనల్ డిజైనర్స్ డిజైన్ చేసిన ప్రత్యేకమైన డ్రెస్సు ఐశ్వర్యరాయ్ ధరించారు. అయితే ఇలాంటి సింపుల్ ఈవెంటుకు ఈ రేంజిలో డ్రెస్సు ధరించడం కాస్త ఎక్కువనే అంటున్నారు కొందరు.

సింపుల్ రింగ్
ఈ డ్రెస్సు కు మ్యాచింగుగా భారీగా ఆభరణాలు ఏమీ ధరించలేదు. సింపుల్ గా ఒక రింగ్ మాత్రమే ఆమె ధరించారు.


Click it and Unblock the Notifications











