ఇష్టం లేకున్నా బికినీ వేయాల్సి వచ్చింది: ఐశ్వర్యరాయ్
హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీలంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది అందమైన భామలే. ముఖ్యంగా ఈ ఫోటీల్లోఉండే బికినీ రౌండ్ గురించి మగాళ్లంతా ఆశగా ఎదురు చూస్తుంటారు. అయితే అలా ఎదురు చూసే వారికి ఇపుడు ఓ బ్యాడ్ న్యూస్. తాజాగా మిస్ వరల్డ్ పోటీల నుండి బికినీ తొలగించారు.
ఈ అందాల పోటీలకు అధ్యక్షురాలిగా ఉన్న జూలియా మోర్లీ ఈ విషయాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. ఈ రౌండ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని నిర్వాహకులు భావిస్తున్నారు. ఆమె ప్రకటనపై మిశ్రమ స్పందన వస్తోంది. ఆ దిక్కుమాలిన రౌండ్ లేక పోయినా ఫర్వాలేదు అని కొందరు సంతోష పడుతుంటే...ఇంతకాలం బికినీ రౌండ్ కోసం ఎంతో కష్టపడి తమ శరీరాన్ని అందంగా మలుచుకున్న భామలు మాత్రం నిరాశ పడుతున్నారు.

బికినీ రౌండ్ తొలగించడంపై మన మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యరాయ్ హర్షం వ్యక్తం చేసింది. తను పోటీ చేసిన సమయంలో బికినీ రౌండ్ ఉండేదని, వాస్తవానికి నా శరీరాకృతి బికినీకి తగిన విధంగా ఉండేది కాదని, అయితే అప్పుడు ఆ రౌండ్ తప్పనిసరి కావడంతో వేయక తప్పలేదని ఆమె చెప్పొచ్చారు.
అయినా....బికినీ రౌండ్ ఉన్నా, లేక పోయినా ఒరిగేది ఏమీ లేదు. విజేతలను నిర్ణయించడంలో ఈ రౌండ్ కు పెద్దగా ప్రాధాన్యత లేదు. నేను పోటీ చేసిన సమయంలో చాలా మంది నాకంటే మంచి బికినీ శరీరాకృతి కలిగి ఉన్నారు. అయినా నేను విజయం సాధించానంటే ఆత్మవిశ్వాసం, ఆటిట్యూడ్ ఇతర విషయాలే కారణం అంటోంది ఐష్.


Click it and Unblock the Notifications











