లండన్ లో ‘రోబో’ చూసిన ఆమె ఆనందానికి అవదుల్లేవంట...!?
తను నటించిన 'రోబో" చిత్రం ఇండియాలో కొత్త రికార్డులు సృష్టిస్తుండగా ఈ ఆనందాన్ని దగ్గరుండి పంచుకోలేకపోతున్నారు ఐశ్వర్య రాయ్. తనిప్పుడు మిలన్, ఫ్రాన్స్, లండన్ దేశాలను చుట్టే పనిలో వున్నారు. భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఆమె ఇటీవల మిలన్ వెళ్లారు. అర్మాని ఫ్యాషన్ షోకి హాజరవ్వడం కోసం తను అక్కడికి వెళ్లారు. అలాగే ప్రసిద్ధ ఫ్యాషన్ డి జైనర్ రాబర్ట్ కేవల్లి ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఆమె అక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్ళారు. ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాబర్ట్ ఇచ్చిన అతిపెద్ద పార్టీలో ఆమె పాల్గొన్నారు.
అదే సమయంలో 'రోబో" విడుదలైన సందర్భంగా అక్కడ్నించి లండన్ వెళ్లి, ప్రత్యేకంగా సినిమా ప్రదర్శనను ఏర్పాటుచేసుకుని ఆమె చూడటం జరిగిందట. సినిమా చూసిన తర్వాత ఇక ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయిందని ఐష్ సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో చేసిన 'రావణ్" నిరుత్సాహపరిచిన తర్వాత 'రోబో" మీద ఐష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
'రోబో" అమోఘ విజయం సాధించడంతో పాటు తన నటనకు, ముఖ్యంగా తన అందానికి ముగ్థులయ్యామని ప్రతి ఒక్కరూ చెబుతుంటే ఆమె తబ్బిబ్బవుతున్నారట. అదేవిధంగా మీడియాలో వస్తున్న రివ్యూలక్కూడా ఆమె థ్రిల్ ఫీలయ్యారట. ఏమైనా ముంబై వచ్చి, అందరి మధ్య తన ఆనందాన్ని మరింతగా పంచుకోవాలని ఆరాటపడుతున్నారట.


Click it and Unblock the Notifications











