ఐశ్వర్య రాయ్ స్టన్నింగ్ లుక్ కేన్స్
అందాల తార ఐశ్వర్య రాయ్ ప్రెగ్నీస్సీ తర్వాత బాగా బరువెక్కి వార్తల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఆమె బాగా లావెక్కిందని, సినిమాలకు నటించే అందమైన పర్సనాలిటీని కోల్పోయిందని వార్తలు కూడా మొదలయ్యాయి. అయితే తాజాగా ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చాలా అందంగా దర్శనం ఇచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఈ వేడుకలో ఆమె ధరించిన సారీ తెగ ఆకట్టుకుంటోంది. దీన్ని ఫేమస్ డిజైనర్స్ అబుజాని-సందీప్ కోస్లా కలిసి డిజైన్ చేశారు. ఆమె కొప్పు సింగారం కూడా భారతీయ మగువలను తెగ ఆకర్షిస్తోంది. గత 10 సంవత్సరాల నుంచి ఐశ్వర్య కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి హాజరవుతూ అదిరిపోయే లుక్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూవస్తోంది.
'బేటి బి'కి జన్మనిచ్చిన తర్వాత ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరం అయిన సంగతి తెలిసిందే. అయినా సరే త్వరలోనే మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే ప్రయత్నాలు మొదలయ్యాయి కూడా. అయితే ఎవరి సినిమా ద్వారా ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది? సెకండ్ ఇన్సింగ్స్ లో ఆమెతో నటించే తొలి హీరో ఎవరు? తదితర అంశాలు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయ్యాయి.
తొలుత శ్రీరామ్ రాఘవన్'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాల ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందని ప్రచారం జరుగుతున్నప్పటికీ....సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న బాజీరావు మస్తానీ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ఎంట్రీ ఇవ్వబోతోందిన మరో ప్రచారం కూడా ఉంది. మరి ఈ అందాల తార మళ్లీ తెరపై దర్శనం ఇచ్చేది ఎప్పుడో..అభిమానుల ఆశ తీరేది ఎప్పుడో..?


Click it and Unblock the Notifications












