ఐశ్వర్యరాయ్ స్టన్నింగ్ లుక్ కామన్ వెల్త్ గేమ్స్
గ్లాస్గో: ఇటీవల జరిగిన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తన అందచందాలతో ఆకట్టుకున్న ఐశ్వర్యరాయ్.....తాజాగా స్కాట్లాండులోని గ్లాస్కోలో జరిగిన కామన్ వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో అందాల దేవతలా దర్శనమిచ్చి చూపరుల మతి పోగొట్టింది. పాశ్చాత్య దుస్తుల్లో ఐశ్వర్యరాయ్ సెక్సీగా మెరిసి పోయింది.
లాంగిని అనే ఇంటర్నేషనల్ వాచీల కంపెనీకి ఐశ్వర్యరాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటంతో ఆ సంస్థ తరుపున ఆమెకు కామన్ వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనేందుకు ప్రత్యేక ఆహ్వానం అందింది. కామన్ వెల్త్ గేమ్స్‌కు స్పాన్లర్లుగా ఉన్న సంస్థల్లో లాంగిని సంస్థ కూడా ఒకటి. ఈ ఓపెనింగ్ సెర్మనీలో ఐశ్వర్యరాయ్ వీఐపీ బాక్సులో దర్శనమిచ్చింది. ఇతర సంస్థల బ్రాండ్ అంబాసిడర్లతో ఆమె ముచ్చటిస్తూ కనిపించారు.

సెమీ ఫార్మల్ డ్రెస్సులో ఆమె క్లాసీ లుక్‌తో ఆకట్టుకున్నారు. కామన్ వెల్త్ గేమ్స్ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొనేందుకు ఆమె తన కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలిసి స్కాట్ లాండ్‌లోని గ్లాస్గోకు చేరుకున్నారు. ఆరాధ్యను చూసుకునేందుకు ఐశ్వర్యరాయ్ మదర్ కూడా గ్లాస్గో వచ్చినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజుల క్రితం ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్, మామ అమితాబ్‌తో కలిసి ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు బ్రెజిల్ వచ్చారు. కుటుంబం అంతా జాలీగా గడిపారు.


Click it and Unblock the Notifications











