హీరోతో స్పెషల్ రిలేషన్ రూమర్స్ ..ఐశ్వర్య రాయ్
ఐశ్వర్య రాయ్ తన తాజా చిత్రం గుజారిష్ లో హృతిక్ రోషన్ తో కలసి సన్నిహితంగా నటించడంపై వచ్చిన రూమర్స్ పై మండిపడుతోంది. ఆమె అసహనం వ్యక్తం చేస్తూ...ఇలాంటి రూమర్స్ ఎట్లా పుడతాయో తెలియదు. ఇవన్నీ ఊహాగానాలే. వెండితెరపై కెమిస్ట్రీ పండటమంటే అది పాత్రల మధ్యనే తప్ప నటీనటుల మధ్య కాదు అని ఆమె కొల్ కత్తాలో ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ప్రేక్షకులు రెండు పాత్రల మధ్య అనుబంధాన్ని మాత్రమే ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం దాన్ని నటీనటుల మధ్య కెమిస్ట్రీగా ప్రచారం చేస్తారు అంటూ చెప్పుకొచ్చింది.
ఇక హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ జంటగా సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో రూపొందిన 'గుజారిష్' చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. చిత్రం కథ ప్రకారం ఎథేన్ (హృతిక్ రోషన్) రేడియో ప్రోగ్రామ్ ల ద్వారా మేజిక్ కు సంబంధించిన ప్రసంగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. అతనికి యాక్సిడెంట్ లో వెన్నెముక దెబ్బతింటుంది. సోఫియా డిసౌజా (ఐశ్వర్య రాయ్) నర్సు. వివాహిత. కొన్నాళ్ళకు ఎథేన్, సోఫియా మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ సమయంలోనే ఒమర్ సిద్ధికి అనే వ్యక్తి ఎథేన్ ను కలుస్తాడు. ఆ తర్వాత ఏమైంది? ఈ ముగ్గురి జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులేమిటి? అనేది ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు.


Click it and Unblock the Notifications











