ఐశ్వర్యరాయ్ సిగెరెట్ కాల్చటం ప్రజలను ప్రభావితం చేస్తుంది
ఐశ్యర్యరాయ్ తాజా చిత్రం 'గుజారిష్' లో ఆమె సిగెరెట్ కాలుస్తూ కనపడనుంది. దీనికి సంభందించిన పోస్టర్స్, ప్రోమోలు అన్ని చోట్ల కనపడుతున్నాయి. సినిమా ప్రచారం నిమిత్తం విరివిగా వాడారు. అయితే ఐశ్వర్యారాయ్ వంటి హీరోయిన్ అలా సిగెరెట్ కాలుస్తూ కనపడితే ఆమె అభిమానులు అదో ఫ్యాషన్ గా భావించి సిగెరెట్ కాల్చాలనే కోరికకు బానిసగా మారతారంటూ వివాదం మెదలైంది. ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖులు ఇలా కనిపించడం ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తుందంటూ ఆయా సంఘాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.హృతిక్ రోషన్ ప్రక్కన కూర్చుని ఐశ్వర్య సిగెరెట్ కాలుస్తూ ఉన్న పోస్టర్‌లు తీవ్ర నిరసనలకు కారణమైనాయి. ధూమపాన వ్యతిరేక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రజలపై బాలీవుడ్ ప్రభావం అమితంగా ఉంటుందని పేర్కొన్నారు. సినిమా పబ్లిసిటీ నుంచి ఈ సీన్ ని, పోస్టర్స్ ని తక్షణం తప్పించేయాలని డిమాండ్ చేశారు. అయితే, సినిమాలో అదొక పాత్ర అని, ఐశ్వర్యారాయ్ కాలుస్తున్నట్లుగా ఫీల్ కాకూడదని, తాము ఆ సీన్ తీసేందుకు అంగీకరించమని 'గుజారిష్'నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ శుక్రవారమే ఐశ్యర్య, హృతిక్‌రోషన్ నటించిన 'గుజారిష్' చిత్రం విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











