రజనీ దగ్గర నేర్చుకున్నది మా ఆయనతో...ఐష్
రజనీకాంత్ స్టైల్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు. అలాగే ఆయనతో తాజాగా పనిచేసిన హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కూడా...ఆ స్టైల్స్ అంటే తనకు చాలా ఇష్టమనని చెప్తోంది. అలాగే తాను..రజనీ నటించిన పలు తమిళ చిత్రాలు చూశానని, ఒక్కో చిత్రంలోఒక్కో విధంగా స్టైల్ ఉంటుందని చెప్పింది. వాటిన్నటిలో.. రజనీ కళ్లజోడు గిరిగిరాతిప్పి పెట్టుకునే స్టైల్ చాలా బాగుంటుందని, రోబో షూటింగ్ సమయంలో ఆ స్టైల్‌ను తాను నేర్చుకోవాలని ప్రయత్నించి ఫెయిల్యూర్ అయ్యానన్నారు. ఒకవేళ నేర్చుకుని ఉంటే దానినితన భర్త అభికి నేర్పాలనుకున్నానని చెప్పుకొచ్చింది. రోబో సూపర్ హిట్ టాక్ రావటంతో ఆమె చాలా ఉత్సాహంగా మీడియాకు ఇంటర్వూలు ఇస్తోంది. ఆ చిత్రంలో ఆమె మెడికల్ స్టూడెంట్ సనాగా, సైంటిస్టు వసీ(రజనీ) ని ప్రేమిస్తుంది. ఆ రోబో కూడా ఆమెతో ప్రేమలో పడటంతో కథ లో మలుపు వస్తుంది. వీరిధ్దరి మధ్యన నలిగిపోయే పాత్రలో ఐష్ అద్బుతంగా చేసిందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక గతంలో శంకర్ దర్సకత్వంలో ఐష్..జీన్స్ అనే చిత్రం చేసింది.


Click it and Unblock the Notifications











