పాపాయితో ఐశ్వర్యరాయ్..(ఫస్ట్ లుక్ ఫోటో)
అందాల ఐశ్వర్య అచ్చం తనలాగే ఉండే అందాల పాపాయికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లి పోయింది. అమితాబ్ తన మనవరాలిని స్వయంగా తన ఒళ్లో పెట్టుకుని తీసుకెళ్లారు. అందుకు సంబందించి ఫోటోనే ఇది.
మరో అందాల తార మా ఇంటికి వచ్చింటూ బచ్చన్ కుటుంబం సంబరాలు జరుపుకుంటోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఆనందానికి అవధులే లేవు. మా ఇంట మహాలక్ష్మి పుట్టిందంటూ రోజంతా పాపాయితోనే గడుపుతున్నాడు బిగ్ బి. ఇక తండ్రి అభిషేక్ కూతురుకి పేరు ను అన్వేషించే పనిలో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఐశ్వర్య బేబీని 'బేటీ బి"(బేటీ బచ్చన్) అని పిలుస్తున్నారు. క్రిస్ మస్ వరకు ఐశ్వర్య కూతురుకు పేరు ఖరారు కానుంది. జోతిష్యలు K అనే అక్షరంతో పేరు పెట్టాలని సూచించినా....అభిషేక్ మాత్రం A అనే అక్షరంతోనే పేరు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











