ఐశ్వర్యారాయ్ ప్రీగానే చేస్తోంది ఎందుకంటే...
రెమ్యునేషన్ గా ఐదు కోట్లు డిమాండ్ చేసే ఐశ్వర్యారాయ్ త్వరలో ఓ చిత్రంలో ఫ్రీగా గెస్ట్ రోల్ చేయనుంది. క్లైమాక్స్ లో లాయిర్ గా కనిపించే ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు జగమోహన్ ముద్రా డైరక్ట్ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ఇంతకుముందు ఐష్ ప్రొవొక్డ్ అనే చిత్రంలో చేసింది. అయితే ఆయన కోసం ఈ చిత్రం చేయటం లేదు. ఐష్ కెరీర్ మొదటి నుంచి ఉంటున్న ఆమె బిజినెస్ మేనేజర్ హరి సింగ్ ఆబ్లిగేషన్ కోసం ఈ చిత్రం ప్రీ గా చేస్తోంది. ఇక ఈ చిత్ర కథ ఓ పెళ్లి కూతరు ఎదుర్కొన్న సమస్యలతో ముడిపడి, నిజ జీవిత సంఘటనలతో ముందుకెళ్తుంది. ఈ చిత్రంలో పెళ్ళి కూతురుగా హరిసింగ్ కూతురు భూమిక సింగ్ చేస్తోంది. ఇంతుకు ముందామే ఆప్ కి ఖాతిర్ చిత్రంలో చేసింది. ఇక ఐష్ గెస్ట్ గా చేసే విషయాన్ని దర్శకుడు జగమోహన్ ముద్రా కూడా కన్ఫర్మ్ చేసారు. ఆయన మాట్లాడుతూ..అవును నిజమే..హరి సింగ్ ఆమెను ఎప్రోచ్ అయి పాత్రను చెప్పగానే ఆమె గెస్ట్ గా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె ఎంట్రి క్లైమాక్స్ కు ఊపు తెస్తుంది.ఆమెతో మళ్ళీ పనిచేయటం థ్రిల్ గా ఉంది అన్నారు. అదీ ఐష్ ప్రీ షో వ్యవహారం.


Click it and Unblock the Notifications











