విజయ్ దేవరకొండ పెళ్లంటూ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

ప్రెసెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ స్టార్ ఎవరు అంటే ఠక్కున వినిపించే సమాధానం విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో అమాంతం క్రేజ్ కొట్టేసిన ఈ రౌడీ స్టార్ ఆ తర్వాత ఎక్కడా వెనుతిరిగి చూడలేదు. వరుస పెట్టి హిట్స్ కొట్టేస్తూ యూత్ ఆడియన్స్ కి ఐకాన్ గా మారాడు విజయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంత స్పీడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న హీరో బహుశా ఈయనేనేమో! అందుకే ఈ హీరోపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి.

యంగ్ హీరోయిన్ తో ప్రేమలో..

యంగ్ హీరోయిన్ తో ప్రేమలో..

విజయ్ దేవరకొండ యంగ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రేమలో మునిగితేలుతున్నారని, ఆ ఇద్దరూ ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. విజయ్ దేవరకొండ యంగ్ హీరో పైగా అమ్మాయిలను బాగా ఆకర్షించే పర్సనాలిటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

గతంలో షాలినీ పాండే, రష్మికలతో

గతంలో షాలినీ పాండే, రష్మికలతో

అర్జున్ రెడ్డి సినిమాలో షాలినిపాండేతో శృతి మించి రొమాన్స్ చేయడం, ఆ తర్వాత గీతగోవిందం లో రష్మిక మందున్నకు లిప్ కిస్ ఇవ్వడం చూసి ఆ ఇద్దరితో కూడా విజయ్‌కి లింక్ పెట్టేశారు. అయితే వీరితో ప్రేమాయణం విషయమై క్లారిటీ రావడంతో తాజాగా ఐశ్వర్య రాజేష్ ని లైన్ లోకి తీసుకొచ్చారు గాసిప్ రాయుళ్లు.

ఆశ్చర్యపోయిన ఐశ్వర్య రాజేష్.. క్లారిటీ

ఆశ్చర్యపోయిన ఐశ్వర్య రాజేష్.. క్లారిటీ

మరికొద్ది రోజుల్లో మొదలుకాబోతున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఇంతలోనే అప్పుడే ఇలాంటి వార్తలు ఆమె దృష్టికి రావడంతో దీనిపై క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య.

సోషల్ మీడియాలో మెసేజ్

సోషల్ మీడియాలో మెసేజ్

నాకో లవ్ స్టోరీ ఉందని కొద్ది రోజులుగా రూమర్లు వింటున్నాను. దయచేసి ఇలాంటి అసత్య వార్తలను సృష్టించకండి. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పే తొలి వ్యక్తిని నేనే. ఒంటరి జీవితం చాలా సంతోషంగా గడుపుతున్నాను అని ట్విట్టర్‌ వేదికగా ఐశ్వర్య ట్వీట్ చేసింది. కానీ ఈ మెసేజ్‌లో ఆమె ఎక్కడా విజయ్ దేవరకొండ పేరు చెప్పక పోవడం విశేషం.

డియర్ కామ్రేడ్

డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ నటిస్తున్న డియర్ కామ్రేడ్ జులై 26 వ తేదీన విడుదలకు సిద్దమయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్‌లో రష్మిక, విజయ్ లిప్‌లాక్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X