నాకు ఇష్టం లేదు కానీ తప్పక చేయాల్సి వచ్చింది.. యంగ్ హీరోయిన్ సంచలనం
Recommended Video
ఓ యాంకర్ గా గ్లామర్ ప్రపంచంలో అడుపెట్టిన ఐశ్వర్య రాజేష్.. ఆ తర్వాత వెండితెరపై కాలుమోపి తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో ప్రత్యేకమైన కథలు ఎంచుకుంటూ తనలోని విలక్షణతను చాటుకుంటోంది. కోలీవుడ్ లో వరుస సినిమాలతో హల్చల్ చేస్తున్న ఈ భామ ఇక టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఫిదా చేయబోతోంది. అయితే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె.. తన కెరీర్‌లో ఓ సందర్భంలో తనకు ఇష్టం లేకున్నా చేయాల్సి వచ్చిన ఒక సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఆ విశేషాలేంటో చూద్దామా..

ఇష్టం లేకున్నా చేశా..
విక్రమ్‌తో కలిసి సామి 2 అనే చిత్రంలో నటించింది ఐశ్వర్య. హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మరో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటించింది. అయితే ఈ సినిమాలో తనకు నటించాలని లేకున్నా నటించాల్సి వచ్చిందని పేర్కొంటూ సంచలన విషయాన్ని బయటపెట్టింది ఐశ్వర్య రాజేష్.

వ్యక్తిగతంగా కోరడం వల్ల తప్పలేదు
సామి 2 లో నటించాలి అనుకోలేదు. అలాంటి పాత్రల్లో చేయడం నాకు అస్సలు ఇష్టముండదు. కొందరు వ్యక్తిగతంగా కోరడం వల్ల తప్పక చేయాల్సి వచ్చింది. మొదట ఆ పాత్రలో నటించేందుకు ఎవరూ అంతగా ఆసక్తి చూపలేదు. ఇలా నేను కేవలం రెండు పాటలు, రొమాంటిక్ సన్నివేశాలకు పరిమితం కావాలి అనుకోవడం లేదు. ఇక నుంచి అలాంటి సినిమాల్లో నేను చేయను అని కుండా బద్దలు కొట్టింది ఐశ్వర్య.

అలా త్రిష తప్పుకుంది
2003 సంవత్సరం విక్రమ్, త్రిష హీరోహీరోయిన్లుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ సాధించిన సామి చిత్రానికి సీక్వెల్‌గా ‘సామి 2' తెరకెక్కించారు. మొదట్లో ఈ సీక్వల్ లో కూడా త్రిషనే చేస్తానని సంతకం చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవడంతో ఆమె స్థానంలో ఐశ్వర్య రాజేష్ నటించింది.

తెలుగు తెరపై
కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్.. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర కానుంది. మరికొద్ది రోజుల్లో మొదలు కాబోయే విజయ్ దేవరకొండ సినిమాలో ఐశ్వర్య అలరించనుంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ, ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్లు పుట్టించారు కొందరు. కానీ అలాంటిదేమీ లేదని సోషల్ మీడియా వేదికగా ఇటీవలే క్లారిటీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్.


Click it and Unblock the Notifications











