బ్రిటిష్ ప్రధాని నుండి ఐశ్వర్యరాయ్‌కి ఆహ్వానం
ముంబై: ఆరాధ్యకు జన్మనిచ్చిన తర్వాత బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ 'జాజ్బా' చిత్రం ద్వారా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు.

ఆసక్తికర విషయం ఏమిటంటే...బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ లండన్ రావాలని ఐశ్వర్యరాయ్‌ని ఆహ్వానించారు. జాబ్బా షూటింగ్ లండన్‌లో జరుపాలని ఆయన ఇన్వైట్ చేసారు. డేవిడ్ కామెరూన్ భార్య సమంత కామెరూన్ ఇటీవల లండన్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్, కూతురు ఆరాధ్యతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డేవిడ్ కామెరూన్ ఈ మాజీ మిస్ వరల్డ్‌ను కలిసారు. మాటల మాధ్యలో ఐశ్వర్యరాయ్ సినిమాల గురించి అడిగి తెలుసుకున్నారు. తాను ప్రస్తుతం జాజ్బా చిత్రంలో నటిస్తున్నానని చెప్పడంతో...ఈ షూటింగ్ లండన్లో నిర్వహించాలంటూ ఇన్వైట్ చేసాడట కామెరూన్. మరి జాజ్బా టీం డేవిడ్ కామెరూన్ ఇన్విటేషన్‌పై ఎలా స్పందిస్తారో తెలియదు కానీ........ఐశ్వర్యరాయ్‌కి విదేశాల్లో పాపులారిటీ ఎంత ఉందో ఈ సంఘటన బట్టి స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











