కూతురిపై అలాంటి ప్రయోగాలు చేయను: ఐశ్వర్యరాయ్
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఆరాద్య జన్మించాక....ఆమె పెంపకంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. అప్పటి నుండి ఆమె అసలు సినిమాలోనూ నటించలేదు. అయితే వాణిజ్య ప్రకటనల్లో మాత్రం నటిస్తూ వస్తోంది. సాధారణంగా ఈ మధ్య సినిమా తారలు తమ వారసులను చిన్న తనంలోనే వెండితెరకు పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఐశ్వర్యరాయ్ మాత్రం అలా చేయనంటోంది. అప్పుడే నా కూతురికి మేకప్ వేసి ప్రయోగాలు చేయను. ఐశ్వర్యరాయ్ మాటలను బట్టి ఆరాధ్యను బాలనటిగా వెండితెరపై చూసే అవకాశం లేదని స్పష్టం అవుతోంది. స
చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఖరారైంది. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆమె మళ్లీ వెండితెర ఎంట్రీ ఇవ్వబతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్, అనుష్క శర్మ కూడా నటించనున్నారు. ఈ ఏడాది జూన్ 3న సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక పోతే ఈ సినిమాకు ‘ఏ దిల్ హై ముష్కిల్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహార్ ఖరారు చేసారు. రిలేషన్ షిప్స్, హార్ట్ బ్రేక్స్, లవ్ తదితర అంశాల చుట్టూ ‘ఏ దిల్ హై ముష్కిల్' కథ తిరుగుతూ ఉంటుందట. మొత్తానికి ఈచిత్రం ఈ తరం యువతను, ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు.
భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. లండన్, న్యూయార్క్, పారిస్, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుగబోతోంది. చాలా కాలం తర్వాత ఐశ్వర్యరాయ్ మళ్లీ వెండి తెరపై మెరవడానికి సిద్దంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











