»   » పండగ చేసుకున్న శ్రీదేవి, ఐశ్వర్యరాయ్ (ఫోటోలు)

పండగ చేసుకున్న శ్రీదేవి, ఐశ్వర్యరాయ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటీమణులు 'కార్వా చౌత్' వేడుకలను ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా ఎంతో సందడిగా జరుపుకున్నారు. ఉత్తర భారత దేశంలో హిందూ మహిళలు జరుపుకునే ఓ సంప్రదాయ ఉత్సవమే 'కార్వా చౌత్'. ఈ పండగను పురస్కరించుకుని మహిళలంతా తమ భర్తల క్షేమం కోసం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు.

ఒక రోజంతా ఉపవాసం పూర్తయ్యాక మహిళలంతా మొదటగా చంద్రున్ని, అనంతరం భర్తలను చూస్తారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నివేశాలు బాలీవుడ్ సినిమాల్లో తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఈ వేడుకను బాలీవుడ్ సెలబ్రిటీలు మంగళవారం ఎంతో గ్రాండ్‌గా జరుపుకున్నారు.

కార్వా చౌత్‌ను ఒక రొమాంటిక్ ఫెస్టివల్‌గా పరిగణిస్తారు. భార్యభర్తల మధ్య ప్రేమకు సింబాలిక్‌గా దీన్ని జరుపుకుంటారు. బాలీవుడ్ చిత్రాలైన బాగ్‌బన్, బివి నెం.1, కభి ఖుషి కభి ఘమ్, దిల్‌వాలె దుల్హనియా లే జాయింగే లాంటి చిత్రాల్లో కూడా ఈ వేడుకలను సీన్లను మనం గమనించొచ్చు.

ఐశ్వర్య రాయ్, శ్రీదేవితో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు 'కార్వా చౌత్' వేడుకను సంతోషంగా జరుపుకున్నారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం....

బచ్చన్ ఫ్యామిలీ

బచ్చన్ ఫ్యామిలీ


ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో బచ్చన్స్ నివాసంలో కార్వా చౌత్ వేడుకలను వీక్షించవచ్చు. కార్వా చౌత్‌ను పురస్కరించుకుని జయా బచ్చన్‌తో పాటు, ఐశ్వర్యరాయ్ బచ్చన్ తమ భర్తల కోసం రోజంతా ఉపవాసం ఉన్నారు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్


ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో ఐశ్వర్యరాయ్ చంద్రున్ని చూసిన అనంతరం తన భర్త అభిషేక్ బచ్చన్‌‍ను చూస్తున్న దృశ్యాన్ని గమనించ వచ్చు.

శ్రీదేవి

శ్రీదేవి


కార్వా చౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని నటి శ్రీదేవి ట్రెడిషనల్ లుక్‌లో దర్శనం ఇచ్చింది. అందకు సంబంధించిన దృశ్యాన్ని మనం ఇక్కడ చూడొచ్చు.

భర్తతో శ్రీదేవి

భర్తతో శ్రీదేవి


భర్త బోనీ కపూర్‌తో కలిసి శ్రీదేవి. ఈ జంట ఎంతో క్యూట్‌గా ఉంది కదూ! 1996లో వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పటికే ఎంతో అన్యోన్యంగా దాంపత్యం సాగిస్తున్నారు.

భార్యతో సంజయ్ కపూర్

భార్యతో సంజయ్ కపూర్


అనిల్ కపూర్ సోదరుడు సంజయ్ కపూర్ తన భార్య మహీప్ కపూర్‌తో కలిసి కార్వా చౌత్ వేడుకల్లో పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అనిల్ కపూర్ నివాసం

అనిల్ కపూర్ నివాసం


కపూర్ కుటుంబం కార్వా చౌత్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనిల్ కపూర్ నివాసంలో ఈ వేడుక జరిగింది. శ్రీదేవి, బోనీ కపూర్ కూడా హాజరయ్యారు.

చుంకీ, చిక్కి

చుంకీ, చిక్కి


అనిల్ కపూర్ నివాసంలో జరిగిన కార్వా చౌత్ సెలబ్రేషన్స్‌కు నటుడు చుంకీ పాండే...తన సోదరి తో కలిసి హాజరయ్యాడు.

అక్షయ్-ట్వింకిల్

అక్షయ్-ట్వింకిల్


బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, భార్య ట్వింకిల్ కన్నాతో కలిసి కార్వా చౌత్ వేడుకలో పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్


కార్వా చౌత్ వేడుకలను పురస్కరించుకుని బచ్చన్ ఫ్యామిలీ ఔటింగ్‌కు వెళ్లారు. అమితాబ్ స్వయంగా కారు నడుపగా ....అభిషేక్, ఐశ్వర్య ఆయనతో పాటు కార్లో ఉన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

ఐశ్వర్యరాయ్

ఐశ్వర్యరాయ్


కార్వా చౌత్ వేడుక సందర్భంగా ఐశ్వర్య రాయ్ తన నివాసంలో ఇలా కెమెరాకు చిక్కింది.

English summary
Most of the Bollywood couples celebrated Karwa Chauth festival with families. We were able to get you some snaps of the B-Town celebs who celebrated this festival. While some celebrated with larger get togethers, the others kept it small and simple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu