Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
రజనీ కుమార్తె డైరెక్షన్ లో స్ట్రెయిట్ తెలుగు సినిమా.. రంగంలోకి లైకా ప్రొడక్షన్ సంస్థ!
సినిమాల్లో వారసత్వం అనేది చాలా కామన్, అయితే అలా వారసులుగా రంగ ప్రవేశం చేసిన తర్వాత వాళ్ళ వాళ్ళ టాలెంట్ ను బట్టి వాళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది సినీ రంగంలో తమ వారసులను దింపడానికి ప్రయత్నాలు చేశారు. అందులో కొంతమంది సఫలమవుతాయి ఉంటారు కొంతమంది విఫలమవుతుంటారు. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఇద్దరు కుమార్తెలు అన్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తెలు సినీ రంగ ప్రవేశం చేయకపోయినా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య భర్త ధనుష్ తమిళ నాట స్టార్ హీరో అనే సంగతి మనందరికీ తెలిసిందే. భర్త హీరోగా కొనసాగుతుండగా ఐశ్వర్య కూడా సినీరంగంలో ప్రవేశించారు అయితే ఆమె నటనారంగంలో తన అదృష్టం పరీక్షించుకోలేదు కానీ దర్శకురాలిగా మారారు. ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా '3'తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమయ్యారు. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.
ఆ సినిమా నుంచి వచ్చిన వై దిస్ కొలవెరి అనే సాంగ్ ఈనాటికీ చాలా పాపులర్. ఆ తర్వాత 'వెయ్ రాజా వెయ్' అనే సినిమా కూడా చేశారు. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా చేయడానికి ఐశ్వర్య ధనుష్ సిద్ధమవుతున్నారు. పాన్ ఇండియన్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా అయిన రజనీకాంత్ రోబో, అక్షయ్‌కుమార్ నటించిన '2.0' సినిమాలను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిందన్నా సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంస్థ పలు భారీ బడ్జెట్, హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'రామ్ సేతు'తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయికగా 'గుడ్ లక్ జెర్రీ' అనే సినిమాను నిర్మిస్తోంది. ఆలా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మిస్తోంది లైకా సంస్థ.

ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్ సిద్ధమైంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె, హీరో ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతలు సుభాస్కరన్, మహవీర్ జైన్ స్ట్రయిట్ తెలుగు సినిమా నిర్మించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా ఐశ్వర్య ధనుష్ మాట్లాడుతూ ''లైకా ప్రొడక్షన్స్‌లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఎంతో ఆసక్తితో సంతోషంగా ఎదురు చూస్తున్నాను అని అన్నారు. పాన్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది అని ఆమె చెప్పారు. ఇక లైకా ప్రొడక్షన్స్ సీఈవో ఆశిష్ సింగ్ మాట్లాడుతూ ''మా సంస్థలో తొలి స్ట్రయిట్ తెలుగు సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తుండడం మాకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకం మాకుంది అని ఆయన చెప్పారు. ఇక ఈ సినిమాలో నటీనటులు, పని చేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారని అంటున్నారు.