విడాకుల ప్రకటన అనంతరం మరోసారి ఆస్పత్రి పాలైన ఐశ్వర్య రజినీకాంత్..కారణమేంటంటే..
సినీ ప్రముఖులు ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటున్న క్రమంలో ఎప్పుడూ వార్తల్లో నిలవని వారు కూడా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన భర్త ధనుష్ తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో అందరి దృష్టి ఐశ్వర్య ధనుష్ మీద పడేలా చేసింది. రజినీకాంత్ కుమార్తెగా, ధనుష్ భార్యగా దర్శకురాలిగా కూడా ఐశ్వర్య ఎక్కువగా లైమ్ లైట్‌లోకి రాలేదు కానీ ధనుష్‌తో విడిపోయినట్టు ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటినుండి ఆమె మీదనే అందరి ఫోకస్ పడింది. అయితే ఆమె మరోమారు హాస్పిటల్ బారిన పడ్డారు. అసలు ఆమెకు ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే

బిజీగా
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె, ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ ఇప్పటికే రెండు సార్లు కోవిడ్ బారిన పడ్డారు. ఆ రెండు సార్లు కూడా ఆమె ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. అలా రెండో సారి కూడా ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ తన పనుల్లో బిజీ అయిపోయారు. డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో సత్తా చాటాలనుకుంటున్న ఐశ్వర్య ఇప్పుడు ఓ మ్యూజిక్ వీడియో డైరెక్ట్ చేసే పనుల్లో బిజీగా ఉన్నారు.

వైద్యం చేస్తుంటే
ఇక ఇలా ఉన్న సమయంలో తాను మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు ఐశ్వర్య రజినీకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ఒక పోస్ట్ షేర్ చేసిన ఐశ్వర్య. 'జీవితం అనేది కోవిడ్‌కు ముందు, కోవిడ్‌కు తర్వాత అన్నట్టుగా అయిపోయింది. మరోసారి జ్వరంతో ఆసుపత్రిలో చేరా కానీ ఒకవేళ ఒక మంచి, అందమైన, స్ఫూర్తినిచ్చే డాక్టర్ వచ్చి మీకు వైద్యం చేస్తుంటే.. పరిస్థితి అంత దారణంగా ఏమీ అనిపించదు. మీతో కలిసి ఉమెన్స్ డే ఈవ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది ప్రీతికా చారి' అంటూ తనకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్‌తో నవ్వుతూ ఫోటో దిగి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఐశ్వర్య.
అయితే ఆమె హాస్పిటల్ లో చేరిన సంగతి తెలుసుకుని ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు సహా నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న హీరో ధనుష్, దర్శకురాలు ఐశ్వర్యలు ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం ఇద్దరూ తమ తమ పర్సనల్ -ప్రొఫెషనల్ పనుల్లో ఫుల్ బిజీగా మారిపోయారు.

హాట్ టాపిక్ గా
అయినా ఇప్పటికీ ఐశ్వర్య తన సోషల్ మీడియా ఐడీ నుంచి తన భర్త పేరును తొలగించలేదు. అయితే తాజాగా ధనుష్ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ బర్త్‌డే పురస్కరించుకుని ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలపగా అది కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఫ్యామిలీతో టచ్‌లోనే
'నా గురువు, స్నేహితుడు, తండ్రివంటి వ్యక్తికి బర్త్‌డే శుభాకాంక్షలు. మీతో బంధం మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా' అంటూ సెల్వరాఘవన్‌తో దిగిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఐశ్వర్య. దీనికి సెల్వ రాఘవన్ 'ప్రియమైన కూతురికి ధన్యవాదాలు' అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ధనుష్ కి దూరంగా ఉన్నా ఆయన ఫ్యామిలీతో టచ్‌లోనే ఉంది ఐశ్వర్య అని అంటూ కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











