విలన్ వేషాల అజయ్ మరోటి పట్టాడు
ఆ ఒక్కడే,సారాయి వీర్రాజు అంటూ తను హీరోగా నటించిన రెండు చిత్రాలు ఫ్లాఫ్ అయినా అజయ్ కి కెరీర్ పరంగా ఇబ్బందేమీ లేదు. ఆయన తాజాగా తమిళ దర్శకుడు సేతు మాధవన్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో రూపొందుతోంది. అలాగే ఈ చిత్రకథ విని ఇన్‌స్పైర్ అయిన సంగీతదర్శకుడు ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించడానికి అంగీకరించారని సమాచారం. ఈ నెల 18న ఈ చిత్రం పాటలరికార్డింగ్ చెన్నైలో జరుగుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి విలన్ గా పేరుతెచ్చుకున్న అజయ్ ఈ సినిమాతో నైనా హీరోగా సెటిలవుతాడని ఆశిద్దాం.
More from Filmibeat
అజయ్ సారాయి వీర్రాజు విక్రమార్కుడు రాజమౌళి ఆ ఒక్కడే ajay aa okkade saarai veerraju pokiri vikramarkudu rajamouli


Click it and Unblock the Notifications











