చిర్రెత్తిపోయిన ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్, ఒక్క ట్వీటుతో మూయించాడు!

'ఆర్ఎక్స్ 100' ద్వారా తొలి చిత్రంతోనే సక్సెస్ అందుకున్న అజయ్ భూపతి తన తర్వాతి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో వైపు ఇదే సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళుతున్నారు. ప్రస్తుతం కార్తికేయ 'హిప్పి' , 'గుణ 369' చిత్రంలో నటిస్తున్నాడు.

రామ్ గోపాల్ వర్మ వద్ద శిష్యరికం చేసిన అజయ్ భూపతి తర్వాత సినిమా ఏమిటనే విషయమై తరచూ రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. 'ఆర్ఎక్స్ 100' తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా సినిమా తీయబోతున్నాడని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలిపోయింది.

వరుస రూమర్లతో చిర్రెత్తిపోతున్న డైరెక్టర్

వరుస రూమర్లతో చిర్రెత్తిపోతున్న డైరెక్టర్

ఇటీవల అజయ్ అక్కినేని స్టార్ నాగ చైతన్యను కలిశాడని.. తన వద్ద ఉన్న కథ చెప్పాడని.. ఇందలో చై పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడని... పుకార్లు షికార్లు చేశాయి. అయితే తన నుంచి ఎలాంటి ప్రకటన రాకుండానే మీడియాలో ఈ రూమర్స్ స్ప్రెడ్ అవ్వడంపై ఈ యంగ్ డైరెక్టర్‌కు ఆగ్రహం తెప్పించింది.

ఎప్పుడు, ఎవరితో, ఎలా తీయాలో నాకు తెలుసు

ఎప్పుడు, ఎవరితో, ఎలా తీయాలో నాకు తెలుసు

తన తర్వాతి సినిమా గురించి వస్తున్న రూమర్లను అజయ్ భూపతి ట్విట్ ద్వారా కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ‘నా రెండో సినిమా ఎప్పుడు, ఎవరితో, ఎలా తీయాలో నాకు తెలుసు. దయచేసి వదంతుల్ని ఇక ఆపండి' అని పేర్కొన్నారు. ఏ విషయం అయినా తానే స్వయంగా ప్రకటిస్తానని తెలిపారు.

తర్వాతి సినిమాపై పెరిగిన అంచనాలు

తర్వాతి సినిమాపై పెరిగిన అంచనాలు

అజయ్ భూపతి మీద మీడియాలో ఇంత ఫోకస్ రావడానికి కారణం ‘ఆర్ఎక్స్ 100' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకోవడమే. తొలి మూవీ సక్సెస్ ఎఫెక్ట్ అతడి తర్వాతి సినిమాపై పడింది. నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే అంచనాలు పెరిగాయి.

ఆర్ఎక్స్ 100

ఆర్ఎక్స్ 100

కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రూపొందిన ‘ఆర్ఎక్స్ 100' గతేడాది జులైలో విడుదలైంది. కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X