twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘శ్రీకారం’ కాపీ కాదు.. అవే అలా వచ్చాయి.. అది మామూలు విషయం కాదు: అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్

    |

    ఈ మధ్య కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సందేశాత్మక చిత్రాలు ఎన్నో వచ్చాయి. అవన్నీ ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అందుకే ఆ తరహా సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు, హీరోలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యవసాయం గొప్పదనం, అవసరం గురించి చాటి చెప్పే సినిమాలు కూడా చాలా వచ్చాయి. ఇందులో భాగంగానే ఇలా తాజాగా వచ్చిన చిత్రం 'శ్రీకారం'. ఈ సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

     అలా శ్రీకారం చుట్టిన టాలెంటెడ్ శర్వానంద్

    అలా శ్రీకారం చుట్టిన టాలెంటెడ్ శర్వానంద్

    శర్వానంద్ హీరోగా కిశోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన చిత్రమే 'శ్రీకారం'. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట దీన్ని నిర్మించారు.టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

     దాని ఆధారంగా తీసిన సినిమానే ‘శ్రీకారం'

    దాని ఆధారంగా తీసిన సినిమానే ‘శ్రీకారం'

    కిశోర్ రెడ్డి కొన్నేళ్ల క్రితం 'శ్రీకారం' అనే షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. వ్యవసాయ రంగంలోని సమస్యలపై తీసిన దీనికి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు సైతం ప్రశంసించేలా దీన్ని తెరకెక్కించాడు. ఇది చూసిన తర్వాతనే నిర్మాతలు అతడికి అవకాశం కల్పించారు. ఈ ఫిల్మ్ ఆధారంగానే వ్యవసాయం గొప్పదనం చూపించేందుకు అదే టైటిల్‌తో 'శ్రీకారం' సినిమాను తీశాడు.

     భారీ అంచనాలు.. అనుగుణంగానే బిజినెస్

    భారీ అంచనాలు.. అనుగుణంగానే బిజినెస్

    'శ్రీకారం' మూవీపై మొదట్లో అంచనాలు లేకున్నా.. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంతో శర్వానంద్ కెరీర్‌లోనే తొలిసారి దీనికి భారీగా బిజినెస్ జరిగింది. నైజాంలో రూ. 5.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.40 కోట్లు, ఆంధ్రాలో రూ. 8 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటితో ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ బిజినెస్ రూ. 17.10 జరిగినట్లు తెలుస్తోంది.

    అన్నింటి కంటే ఎక్కువ... రెస్పాన్స్ అలాగే

    అన్నింటి కంటే ఎక్కువ... రెస్పాన్స్ అలాగే

    మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం పలు చిత్రాలతో పాటు 'శ్రీకారం' కూడా విడుదలైంది. మిగిలిన వాటితో పోలిస్తే దీనికి థియేటర్లు ఎక్కువగా లభించాయి. దీంతో భారీ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో పాజిటివ్ టాక్‌తో పాటు రివ్యూలు కూడా అనుకూలంగా వచ్చాయి.

    మొదటి రోజు కలెక్షన్లు ఎక్కడ? ఎంతంటే?

    మొదటి రోజు కలెక్షన్లు ఎక్కడ? ఎంతంటే?

    ఫస్ట్ డే 'శ్రీకారం' నైజాంలో రూ. 1.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 54 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 27 లక్షలు, గుంటూరులో రూ. 65 లక్షలు, కృష్ణాలో రూ. 23.10 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌ రూ. 12 లక్షలు, కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 10 లక్షలతో మొత్తంగా రూ. 4.29 కోట్లు షేర్, రూ. 7.30 కోట్లు గ్రాస్ రాబట్టింది.

    కాపీ ఆరోపణలపై అజయ్ భూపతి కామెంట్స్

    కాపీ ఆరోపణలపై అజయ్ భూపతి కామెంట్స్

    తాజాగా 'శ్రీకారం' సినిమా సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చాడు RX100 దర్శకుడు అజయ్ భూపతి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ కాపీ ఆరోపణలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 'శ్రీకారం అనే షార్ట్ ఫిల్మ్ 2016లోనే వచ్చింది. దాని ఆధారంగానే ఇది వచ్చింది. ఈ గ్యాప్‌లోనే అలాంటివి కొన్ని సినిమాలు వచ్చాయి. సో.. ఇది కాపీ కాదు' అని అన్నాడు.

     అది మామూలు విషయం కాదు అంటూ

    అది మామూలు విషయం కాదు అంటూ

    దర్శకుడు కిశోర్ గురించి మాట్లాడుతూ.. 'శ్రీకారం షార్ట్ ఫిల్మ్‌ను అద్భుతంగా తీశాడు కిశోర్. దాన్నే డెవెలప్ చేసి ఈ సినిమాను రూపొందించాడు. మొదటి సినిమానే సందేశాత్మకంగా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాకి నేను బాగా కనెక్ట్ అయిపోయా. శర్వానంద్ గారి పెర్ఫామెన్స్ అద్భుతం. అతడిలోని వైవిధ్యాన్ని చూసి షాకైపోయా' అంటూ చెప్పుకొచ్చాడు అజయ్.

    English summary
    Sharwanand Sreekaram is directed by newcomer Kishore Reddy and produced Ram Achanta and Gopichand Achanta under their banner 14 Reels Plus. The film was formally launched with a pooja ceremony on Sunday morning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X