చీప్ స్టార్ అంటూ ‘RX100’ డైరెక్టర్ ట్వీట్.. ఆ హీరోనే అన్నాడంటూ ప్రచారం.. ఇండస్ట్రీలో కలకలం

'RX100' దర్శకుడు అజయ్ భూపతి త్వరలోనే మాస్ హీరోతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని ఎప్పటి నుంచో ఓ వార్త హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధార్ద్‌ను కూడా నటింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు జరుపుతున్నాడని ఆ మధ్య ప్రచారం జరిగింది. దీనికి 'మహాసముద్రం' అనే టైటిల్ అనుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటి వరకు ఇటు అజయ్ భూపతి కానీ, అటు ఆ హీరో కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ చేసిన ట్వీట్ చర్చనీయాశం అవుతోంది.

చీప్ స్టార్ అంటూ డైరెక్టర్ ట్వీట్

సోమవారం ఈ యంగ్ డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో ‘చీప్ స్టార్' అని ఓ ట్వీట్ చేశాడు. దీంతో ఇది చర్చనీయాంశం అవుతోంది. అజయ్ ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడనన్నది సస్పెన్స్‌గా మారింది. దీంతో ఆయన ఫ్యాన్స్ అందరూ ఎవరిని అన్నారో చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్వీట్ తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.

ఆ హీరోను ఉద్దేశించే అంటూ ప్రచారం

ఆ హీరోను ఉద్దేశించే అంటూ ప్రచారం

అజయ్ భూపతి చేసిన ట్వీట్ ఎవరి గురించో పక్కాగా తెలియదు కానీ, ఇది ఇండస్ట్రీలోని ఓ మాస్ హీరోను ఉద్దేశించే చేశాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్టు ‘మహాసముద్రం' చేస్తానని హ్యాండ్ ఇచ్చిన హీరోనే అని ఉంటాడని అంటున్నారు. అయితే, ఆ హీరో పేరు మాత్రం బయటకు రావడం లేదు. దీంతో ఆయన ఎవరన్నది సస్పెన్స్‌గానే మారింది.

చాలా కాలం తిప్పుకుని..

చాలా కాలం తిప్పుకుని..

సదరు హీరో అజయ్ భూపతిని చాలా కాలం తిప్పుకుని హ్యాండ్ ఇచ్చాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మొదట్లో ఈ స్క్రిప్టుకు కొన్ని మార్పులు చేయమని చెప్పాడట ఆ మాస్ హీరో. ఆ తర్వాత మరో కారణం చెప్పాడట. ఇలా దాదాపు ఐదు నెలలుగా ఈ యంగ్ డైరెక్టర్‌ను తన ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నాడట. చివరకు సినిమా మాత్రం చేయడానికి సిద్ధం కాలేదని టాక్.

దర్శకుడి ఆవేదన ఈ రూపంలో

దర్శకుడి ఆవేదన ఈ రూపంలో

‘మహాసముద్రం' స్క్రిప్టును రవితేజతో పాటు పలువురు యంగ్ హీరోలకు చెప్పాడట అజయ్ భూపతి. అయితే, వీరిలో ఒకరు మాత్రమే ఆయనకు మంట పుట్టించి ఉంటారని, అందుకే ఈ విధంగా ట్వీట్ చేసుంటాడని అంటున్నారు. ఈ ట్వీట్ వెనుక దర్శకుడి ఆవేదన మాత్రం అందరికీ అర్థం అవుతోందన్న టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X