'హౌస్ ఫుల్' డైరక్టర్ తో నాగచైతన్య నెక్ట్స్

By Srikanya

నాగచైతన్య తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా అజయ్ భువన్ ని ఎంపిక చేసుకున్నారు. అతను ఇంతకు ముందు 'హౌస్ ఫుల్' అనే చిత్రాన్ని డైరక్ట్ చేసాడు. ఆ చిత్రం ఎవరూ కొనక రిలీజ్ కాలేదు.దర్శకుడు చంద్రసిద్దార్ధ ఆ చిత్రాన్ని నిర్మించారు. అయితే అజయ్ ..సెట్లో నాగచైతన్యను కలిసి ఓ స్క్రిప్టు వినిపించాడని సమాచారం. అది బాగా నచ్చిన నాగ చైతన్య తన తండ్రి నాగార్జున వద్దకు పంపటం ఆయన ఆ కథ విని తన పర్మెనెంట్ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి వద్దకు పంపారు. అలా ఆ చిత్రం కన్ఫర్మ్ అయింది. అజయ్ భువన్ ఫిల్మ్ స్కూల్ లో చదువుకు వచ్చారు. ఆయన ఐఐటి,ఐఐఎమ్ స్టూడెంట్. ఇక ఈ చిత్రంలో ఎక్కువ బాగం అమెరికాలో జరుగుతుందని తెలుస్తోంది. విలన్ గా ప్రకాష్ రాజ్ ని పరిశీలుస్తున్నారు. ఇతర దేశాల్లో ఇండియా వ్యక్తుల మాఫియా, అలాగే గోవాలో కాసినో పెట్టి డబ్బులు సంపాదించులనుకునే విలన్స్ ఈ చిత్రంలో కనపడతారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ప్రస్తుతం నాగచైతన్య 'ఏం మాయ చేసావో ' అనే చిత్రంలో నటిస్తున్నారు. దానిని వెంకటేష్ తో 'ఘర్షణ' చిత్రాన్ని రూపొందించిన గౌతమ్ మీనన్ డైరక్ట్ చేస్తున్నారు. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చిలో ఈ చిత్రంలో విడుదల కానుంది. మహేష్ సోదరి మంజుల తమ ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X