'దడ' దర్శకుడి నెక్ట్ తెలుగు చిత్రం విడుదల ఈ నెల్లోనే..

By Srikanya

హైదరాబాద్: నాగచైతన్యతో రూపొందించిన 'దడ' చిత్రంతో పరిచయమైన దర్శకుడు అజయ్ భయాన్. ఈ దర్శకుడు తన దడ కమిట్ కాకముందే ఓ చిత్రం రూపొందించారు. ఆ చిత్రం టైటిల్ 'హౌస్‌ఫుల్‌'. 'హౌస్‌ఫుల్‌' చిత్రం చూసి ఇంప్రెస్ అయ్యే నాగార్జున తన కుమారుడుతో దడ చిత్రం రూపొందించమని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడా చిత్రం విడుదలకు సిద్దమైంది. ఎప్పుడో షూటింగ్ పూర్తైనా ఇన్నాళ్లూ ఆ చిత్రం బిజినెస్ కాకపోవటంతో విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్ళకు ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'హౌస్‌ ఫుల్‌' చిత్రాన్ని ఆ నలుగురు వంటి చిత్రాలు డైరక్ట్ చేసిన చంద్రసిద్ధార్థ్‌ సమర్పిస్తున్నారు. . గౌరిపండిట్‌, వేగ, అలీ, జీవా, ఆర్య ఇందులో ముఖ్యతారలు. నిఖితా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సదాశివయాదవ్‌ నిర్మించారు.'సరికొత్త స్క్రీన్‌ప్లేతో రూపొందిన రొమాంటిక్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నేటితరంలో మాటల్లో, చేతల్లో కనిపించే గందరగోళం ఈ చిత్రానికి కథావస్తువు' అని దర్శకుడు చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -''సినిమా చాలా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ'' అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం అడునూప్‌రూబెన్స్‌, ఛాయాగ్రహణం వీఎస్‌. జ్ఞానశేఖర్‌.

ఇక అజయ్ భుయాన్ కి దడ చిత్రం తర్వాత ఏ ఆఫరూ రాలేదు. దాంతో ఆయన హిందీకి వెళ్లిపోయారు. డిల్లీ బెల్లి ఫేమ్ వీరదాస్ ప్రధానపాత్రలో ఆయన ఓ చిత్రం రూపొందిస్తున్నారు. ఈరోస్ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ విషయమై అజయ్ భుయాన్...తన కథ విన్న వెంటనే నిర్మాతలు ఆసక్తిగా చేయటానికి ఓకే చేసారని అన్నారు. ఈ హిందీ చిత్రం ఈ సంవత్సరంలోనే విడుదల కానుంది. దాన్ని తెలుగులోకి సైతం డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X