నాగ చైతన్య ’దడ’ దర్శకుడికి బాలీవుడ్ చాన్స్
నాగ చైనత్య-కాజల్ జంటగా గత కొన్ని రోజుల క్రితం వచ్చిన 'దడ' సినిమా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ చిత్ర దర్శకుడు అజయ్ భూయాన్ దడ సినిమా కంటే ముందే 'హౌస్ ఫుల్' అనే తెలుగు చిత్రాని కమిట్ అయినా ఆ సినిమా ఇంకా పూర్తి కాలేదు. ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల కావొచ్చు. తాజాగా ఈ దర్శకుడు బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం వీర్ దాస్ ( డిల్లీ బెల్లీ ఫేం ) ఈ చిత్రంలో లీడ్ రోల్ పోషించనున్నాడని, ఈ సినిమా పూర్తిగా కామెడీ నేపథ్యంలో రూపొందించేందుకు అజయ్ భూయాన్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడని తెలుస్తోంది. హీరోయిన్ ఇతర నటీనటలు ఎంపిక విషయం అజయ ప్రస్తుతం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ఈరోస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రాన్ని టీనా నాగ్ పాల్, కవిత కుల్ కర్ణి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. ఓ ప్రముఖ పత్రికతో అజయ్ భూయాన్ మాట్లాడుతూ నిర్మాతలు కథ, స్క్రిప్టు విని ఎంతో ఎగ్జైట్ అయ్యారని, మే నెలలో ఈ చిత్రాన్ని ప్రారంభించి, 2013లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











