స్కెచ్ వేసాడు...రాజమౌళి ఏమంటారో
హైదరాబాద్ :కెరీర్ ప్రారంభం నుంచీ ఫ్లాఫ్ నేది లేకుండా వరస విజయాలతో దూసుకువెళ్తున్న దర్శకుడు రాజమౌళి డైరక్షన్ లో చేయాలని ప్రతీ హీరోకూ ఉంటుంది. ఎందుకంటే సక్సెస్ అనేది కోరుకోనివారు ఉండరు కదా. తెలుగు హీరోలు ఆయన దర్శకత్వంలో చేయాలని కోరుకోవటం సహజం. ఇప్పుడు బాలీవుడ్ సైతం అదే బాట పట్టింది. అక్కడ యాక్షన్ హీరోగా గుర్తింపు ఉన్న అజయ్ దేవగన్ రీసెంట్ గా ఆయన దర్శకత్వంలో చేయాలనే కోరిక వెళ్లబుచ్చాడు. ఓ ఇంటర్వూలో ఈ విషయాన్ని తెలియచేసాడు. మరి రాజమౌళి ఏమంటారో చూడాలి.
ప్రభుదేవా దర్శకత్వంలో ప్రముఖ హిందీ హీరో అజయ్ దేవగన్ నటించిన ‘ యాక్షన్ జాక్సన్ ' విడుదల సందర్భంగా ఇంటర్వ్యూలో అజయ్‌దేవగన్ రాజమౌళిని పైకెత్తాశాడు. హిందీ సినిమా చేసే సత్తా రాజమౌళికి ఉంది. ఆయన దర్శకత్వంలో నాకు సినిమా చేయాలని ఉందని అజయ్ అన్నారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా నేను చూశాను. ఆయన ఆలోచనలు గొప్పగా ఉంటాయి. ఎప్పటికైనా అవకాశం కుదిరితే రాజమౌళి గారితో హిందీ సినిమా తీస్తానన్నారు.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘మర్యాద రామన్న' సినిమా హిందీలో రీమేక్‌గా‘ సన్ ఆఫ్ సర్దార్ ' లో నటించిన అజయ్‌దేవగన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రాజమౌళి ఇతర సినిమాలు కూడా హిందీలో రీమేక్ అయి హిట్స్ సాధించాయి. అందుకనే బాలీవుడ్ స్టార్స్ అంతా రాజమౌళిపై కన్నేశారు. అయితే రాజమౌళి తెలుగులోనే రెండు సంవత్సరాలు పాటు సినిమాను తీస్తూంటారు. మరి బాలీవుడ్‌కు వెళితే ఎవరితో సినిమా తీస్తారో వేచి చూడక తప్పదు.

ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ కోసం ప్రభాస్ అభిమానులు అభిమానులే కాకుండా తెలుగు సినీ ప్రియులంతా ఉద్వేగంతో ఎదురు చూస్తున్నారు. కారణం ఆ నెలలో ‘బాహుబలి' తొలి భాగం విడుదల కాబోతోంది. ఒక పెద్ద హీరో సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూడటం సర్వ సాధారణమే. కానీ ‘బాహుబలి' కోసం అందరూ ఇంతగా ఆసక్తి కనపరుస్తుండటానికి కారణం ఏమిటి? ఇది రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న చిత్రం! తెలుగులో.. ఆ మాటకొస్తే భారతదేశంలోనే అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న చిత్రం. ‘బాహుబలి' అంటే బలిష్టమైన చేతులు కలిగినవాడని అర్థం.
ఆ మధ్యన నిర్మాతలు విడుదల చేసిన సినిమా స్టిల్‌లో ప్రభాస్‌ను చూస్తే టైటిల్‌కు సంపూర్ణ న్యాయం చేస్తున్నవాడిలా కనిపించాడు. వీరయోధుడి దుస్తుల్లో, రెండు చేతుల్లో ఆయుధాలతో, కండలు తిరిగిన దేహంతో ఉన్న ప్రభాస్ రూపానికి నిజంగానే విశేషమైన స్పందన వచ్చింది. ఓ పెద్ద హీరో నటించిన పూర్తి స్థాయి జానపద చిత్రం ఇరవై ఏళ్ల క్రితం వచ్చింది.
అది బాలకృష్ణ హీరోగా నటించగా, సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన ‘భైరవ ద్వీపం'. దాని తర్వాత వస్తున్న పూర్తి జానపద చిత్రం ‘బాహుబలి'. రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి రూపొందించగా 2009లో వచ్చిన ‘మగధీర' సగం సాంఘికం, సగం జానపదం. ఇప్పటి రోజుల్లో జానపద చిత్రం తియ్యడం చాలా పెద్ద సాహసం.
ఇదివరకే ‘ఛత్రపతి'గా తనకు మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది రాజమౌళే కాబట్టి, ‘బాహుబలి'గా తనకు కొత్త ఇమేజ్‌ను తెస్తాడని నమ్మాడు ప్రభాస్. అందుకే ఆ పాత్ర కోసం చాలా కష్టపడి తనను తాను తీర్చిదిద్దుకున్నాడు. సెట్స్ మీద కూడా శ్రమిస్తున్నాడు. ఆయన నమ్మకం వమ్ముకాదనీ, ‘బాహుబలి' తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదిస్తుందనీ చాలామంది భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











