అజయ్ దేవగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు: రాజమౌళి
ముంబై: తెలుగులో సూపర్ హిట్ అయిన 'ఈగ' చిత్రాన్ని హిందీలో 'మక్కి' పేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 12 'మక్కి' చిత్రం బాలీవుడ్లో విడుదలువతోంది. లేటెస్ట్‌గా అందిన సమాచారం ప్రకారం బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ 'మక్కి' చిత్రం ఓపెనింగ్ సీన్‌కు వాయిస్ ఇవ్వడానికి ఓప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి స్వయంగా వెల్లడించారు.
తెలుగులో 'ఈగ' సినిమా మొదలు కాగానే బ్యాగ్రౌండ్‌లో రాజమౌళి వాయిస్ ఓ పాపకు కథ చెబుతూ టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. తాజాగా హిందీ 'మక్కి'లో రాజమౌళి వాయిస్ స్థానంలో అజయ్ దేవగన్ వాయిస్ వినపడబోతోంది. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ...'లాస్ట్ నైట్ అజయ్ దేవగన్ మక్కి సినిమా చూసారు. బాగా ఇంప్రెస్ అయ్యారు. సినిమా ఓపెనింగ్‌లో వాయిస్ ఇచ్చేందుకు ఓప్పుకున్నారు' అంటూ ట్వీట్ చేస్తారు.
రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈచిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది.
ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది. అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున.... బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్.


Click it and Unblock the Notifications











