'దూకుడు' హిందీ రీమేక్ కి రెడీ..డిటేల్స్
హైదరాబాద్ : శ్రీనువైట్ల దర్శకత్వంలో మహేష్ నటించిన 'దూకుడు' చిత్రం సూపర్ హిట్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేయనున్నారు. ఈ రీమేక్ లో హీరోగా అక్షయ్ కుమార్ చేస్తున్నారు. అనూష్క శర్మ హీరోయిన్ గా కనిపించనుంది. కొరియాగ్రాఫర్ నుంచి దర్శకుడుగా మారిన ప్రభుదేవా ఈ చిత్రాన్ని రీమేక్ చేయనున్నారు. ఆయన ఇప్పటికే అక్షయ్ తో విక్రమ్ రాధోడ్ చిత్రం చేసారు. విక్రమ్ రాధోడ్ చిత్రం తెలుగులో వచ్చిన విక్రమార్కుడుకి రీమేక్.
మరో ప్రక్క ఈ చిత్రం బెంగాల్ లోకి సైతం రీమేక్ చేసారు. ఆ చిత్రం అక్కడా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోయింది. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం బెంగాళ్ వెర్షన్ టైటిల్ ఛాలెంజ్ 2. బెంగాళ్ సినీ చరిత్రలోనే తొలిసారిగా 270 థియోటర్లలలో విడుదలైంది. త్వరలో ఎబ్రాడ్ లోనూ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక,నిర్మాతలు ఈ విషయాన్ని మీడియాకు తెలియచేసారు.అలాగే చిత్రం విడుదలైన నాలుగు రోజులకే బడ్జెట్ లోని ఎనభై శాతం రికవరీ అయ్యిందని అన్నారు.
మరో ప్రక్క 'దూకుడు' బుల్లితెరపై ప్రసారం అవుతూ టీఆర్పీ రేటింగ్ లలోనూ రికార్జులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్న ప్రముఖ ఎంటర్ టైన్మెంట్స్ ఛానల్ 'మా టివి' ఈచిత్రాన్ని ప్రసారం చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్న 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, అనిల్ సుంకర, గోపీచంద్ ఆచంటలు రూపొందించారు.
ఇక దూకుడుని తమిళంలోకి అనువదిస్తున్నారు. 'అదిరడి వేట్త్టె' పేరిట వేసవి కానుకగా జనం చెంతకు రానుంది. పలువురు కోలీవుడ్ నటులు రీమేక్ చేసుకుంటారనే వార్తలు తొలుత వినిపించినా వాటికి చెక్ పెడుతూ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి తమిళనాట మంచి బిజినెస్ జరుగుతుందనే భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











