శిశు హత్యలు వద్దంటూ... కాజోల్, అజయ్!

By Bojja Kumar

గర్భస్థ శిశు హత్యల అరికట్టేందుకు బాలీవుడ్ స్టార్ కపుల్ అజయ్ దేవగన్, కాజోల్ నడుం బిగించారు. మహరాష్ట్ర ప్రభుత్వం రూపొందించనున్న లఘు చిత్రంలో ఈ ఇద్దరు నటించనున్నారు. మహారాష్ట్రలోని లాతూరు, సోలాపూర్, బీదర్ ప్రాంతాల్లో గర్భస్థ శిశు హత్యలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిని అరికట్టేందుకు శ్రీకారం చుట్టింది.

ఈ చిత్రం గురించి అజయ్ దేవగన్ మాట్లాడుతూ...ప్రస్తుతం స్క్రిప్టు వర్కు జరుగుతోందని, నెల రోజుల్లో చిత్ర షూటింగును ప్రారంభమవుతోందని తెలిపారు. ఇందులో తన భార్య కాజోల్ కూడా పాలు పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన మర్యాదరామన్న చిత్రం హిందీ లో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అజయ్ దేవగన్ హీరోగా చేసిన ఈ చిత్రానికి టైటిల్ సన్ ఆఫ్ సర్ధార్ అని పెట్టారు. ఈ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలకు రెడీ అవుతోంది.

అజయ్ దేవగన్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని రీమేక్ చేసారు. ఈ కామిడీ చిత్రం చూడగానే అజయ్ దేవగన్ నచ్చి ఈ ప్రపోజల్ కి వచ్చారు. అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X