సిల్మ్ స్మిత గా ఆ హోమ్లీ హీరోయిన్ నప్పుతుందా?
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న సిల్క్ స్మిత జీవం ఆధారంగా ఏక్తాకపూర్ ఓ చిత్రం నిర్మించనుందనే సంగతి చాలా రోజులుగా వినపడుతోందే. ఈ చిత్రం త్వరలోనే కార్యరూపం దాల్చనుందని...సిల్క్ స్మిత పాత్రను విద్యాబాలన్ చేయనుందని తెలుస్తోంది. ఇక ఈ వార్త విన్న బాలీవుడ్ జనం ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెడుతున్నారు. ఇప్పటివరకు విద్యాబాలన్ చేసినవన్నీ హోమ్లీ కేరెక్టర్లే. మంచి హోమ్లీ తార అనే కితాబుని కూడా పొందారామె. ఈ నేపథ్యంలో సిల్క్ స్మితగా ఆమె ఎలా సూట్ అవుతుంది? అన్నది కొంతమంది వాదన. కానీ చిత్రదర్శకుడు మిలన్ లూద్రియా మాత్రం ఈ పాత్రను విద్యా చేస్తేనే బాగుంటుందని అంటున్నారు. ఇక ఏక్తా ఇటీవలే మిలన్ లూద్రియా దర్శకత్వంలో ఒన్స్ అపాన్ ఎ టైమ్ అనే హిందీ చిత్రాన్ని నిర్మించారు.ఇక సిల్క్ స్మితగా యాక్ట్ చేయడానికి విద్యా కూడా ఆసక్తి కనబరుస్తున్నారని సమాచారం. త్వరలో ఒప్పంద పత్రాలపై కూడా ఆమె సంతకం పెట్టబోతున్నారని సమాచారం. ఇక సిల్మ్ స్మిత మరణం నేటికీ మిస్టరీగానే ఉండిపోయింది.సిల్క్ స్మిత జీవితంలో ఓ ఫిలిం మేకర్‌కు కీలక పాత్ర ఉందన్న సంగతి తెలిసిందే. ఆ పాత్రను అజయ్ దేవగన్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











