రాజమౌళి 'మర్యాద రామన్న' హిందీ రీమేక్ లో ఎవరు హీరో అంటే...
రాజమౌళి, సునీల్ కాంబినేషన్ లో వచ్చి విజయవంతమైన మర్యాదరామన్న చిత్రం హిందీ రీమేక్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రం హిందీ రీమేక్ లో అజయ్ దేవగన్ హీరోగా నటించనున్నారు. అందుకోసం అజయ్ దేవగన్ మరో ఇద్దరు నిర్మాతలతో కలిసి ఈ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకోవటం జరిగింది. ఈ కామిడీ చిత్రం చూడగానే అజయ్ దేవగన్ నచ్చి ఈ ప్రపోజల్ కి వచ్చారు. అజయ్ దేవగన్ తో అతిధి తుమ్ కబ్ జావోగి అనే కామిడీ చిత్రం రూపొందించిన అశ్విని ధిర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. అయితే హిందికి తగినట్లు కొన్ని మార్పులు చేస్తున్నట్లు చెప్తున్నారు.స్క్రిప్టు వర్క్ పూర్తికాగానే హీరోయిన్ ని ఎంపిక చేసి షూటింగ్ ప్రారంభిస్తామంటున్నారు.ప్రస్తుతం అజయ్ దేవగన్ మరో రీమేక్ కి కమిటయ్యారు. సూర్య హీరోగా తమిళంలో రూపొంది విజయం సాధించిన సింగం(తెలుగులో యముడు) చిత్రంలో ఆయన హీరోగా చేస్తున్నాడు. అజయ్ దేవగన్ తో గోల్ మాల్ -3 రూపొందించిన రోహిత్ శెట్టి ఈ సినిమాని డైరక్ట్ చేస్తున్నాడు. ఇలా వరసగా కామిడీ సినిమాలు అజయ్ కమిటవుతున్నాడు.


Click it and Unblock the Notifications











