ఆర్ఆర్ఆర్ నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ మిస్.. అజయ్ దేవగణ్‌పై చిత్రయూనిట్ ట్వీట్

+ఆర్ఆర్ఆర్ నుంచి ఇప్పటికే అదిరిపోయే అప్‌డేట్స్ వచ్చాయి. రౌద్రం రణం రుధిరం అంటూ రిలీజ్ చేసిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఓ రేంజ్‌లో హల్చల్ చేసింది. దాని ప్రభావం తగ్గకముందే రామరాజు కోసం భీమ్ అంటూ వదిలిన వీడియో మరింత రచ్చ చేసింది. రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేసిన ఈ వీడియోలు అల్లూరి సీతారామరాజు కనిపిస్తే.. కొమరం భీమ్ వినిపించాడు. ఇలా ఇద్దర్నీ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచాడు.

Recommended Video

Ajay Devgn Look From RRR On His birthday, Missed Due To Lockdown

మరో సర్‌ప్రైజ్ మిస్..

అయితే ఆర్ఆర్ఆర్ నుంచి మరో సర్ ప్రైజ్ మిస్ అయినట్టు తెలుస్తోంది. నేడు అజయ్ దేవగణ్ పుట్టిన రోజు. మామూలుగా అయితే ఈ రోజు ఆర్ఆర్ఆర్ నుంచి అజయ్ దేవగణ్ పాత్రకు సంబంధించిన వీడియో రిలీజ్ కావాల్సి ఉందట. కానీ లాక్ డౌన్ నేపథ్యంలో అది కుదరలేదట. ఈ మేరకు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది.

ఫస్ట్ షెడ్యూల్‌లో అజయ్ దేవగణ్..

ఫస్ట్ షెడ్యూల్‌లో అజయ్ దేవగణ్..

మంచి మనసున్న అజయ్ దేవగణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు ఆర్ఆర్ఆర్ చిత్రంలో భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషిస్తున్నాము. ఫస్ట్ షెడ్యూల్‌లో మీతో పని చేయడం మరిచిపోలేని అనుభవం.. మీకు కూడా అలాంటి ఫీలింగే కలిగి ఉంటుందని ఆశిస్తున్నాము. మీకు మరింత మంచి జరగాలి.

లాక్ డౌన్ వల్లే..

లాక్ డౌన్ వల్లే..

అజయ్ దేవగణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్, వీడియో రిలీజ్ చేయాలని ఎంతో భావించాం. దాని కోసం ప్రయత్నించాం. అయితే ఈ లాక్ డౌన్ వచ్చి పడటంతో అంతా తారుమారైంది. మ్యూజిక్, డీఐ మిక్స్ చేయక పోవడంతో ఆ సర్‌ప్రైజ్‌ను ఇవ్వలేకపోయాం. ఒక్క సారి లాక్ డౌన్ ఎత్తివేశాక.. మీకు మళ్లీ అప్‌డేట్ చేస్తామ'ని ట్వీట్ చేసింది.

అత్యంత భారీ ఎత్తున..

అత్యంత భారీ ఎత్తున..

దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నాడు. ఇందుకోసం హాలీవుడ్, బాలీవుడ్ దిగ్గజాలను కూడా దింపిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణం ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X