రాంచరణ్, ఎన్టీఆర్ కోసం క్రేజీ బాలీవుడ్ హీరో, అంతా సస్పెన్స్.. రాజమౌళితో గతంలోనే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఇటీవల ప్రారంభమైంది. బహుబలి లాంటి ప్రపంచ స్థాయి విజయం తరువాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ చిత్రం గురించి చిన్న విషయం బాయటకు వచ్చినా పెద్ద వార్తగా మారుతోంది. సినిమా అయితే ప్రారంభమైపోయింది కానీ ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలు ఇంకా తెలియలేదు. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ హీరో భాగం కాబోతున్నాడనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Recommended Video

#RRRShootBegins : Rajamouli Shares RRR Movie Shooting Stills | Filmibeat Telugu
 సౌత్ ఇండియాలోనే

సౌత్ ఇండియాలోనే

రాజమౌళి లాంటి బడా దర్శకుడి చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ నటిస్తుండడంతో ఈ చిత్రం సౌత్ లోనే క్రేజీ మల్టీస్టారర్ గా మారిపోయింది. బాహుబలి చిత్రాన్ని మించేలా 300 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో కాస్టింగ్ కూడా భారీ స్థాయిలో ఉంటుంది. ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం రాజమౌళి పెద్ద స్టార్స్ ని సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ హీరో పేరు

బాలీవుడ్ హీరో పేరు

ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర కోసం రాజమౌళి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ పేరు పరిశీలిస్తున్నాడట. అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ పాత్ర అజయ్ దేవగన్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోయే విధంగా ఉంటుందని అంటున్నారు. రాజమౌళి ఇప్పటికే అజయ్ దేవగన్ ని సంప్రదించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగన్ రాజమౌళి దర్శత్వంలో ఇంతవరకు నటించకపోయినా ఈగ డబ్బింగ్ కోసం తన గళాన్ని అందించారు. ఆ విధంగా రాజమౌళి, అజయ్ దేవగన్ మధ్య సాన్నిహిత్యం ఉంది.

మరింత భారీగా

మరింత భారీగా

ఇక అజయ్ దేవగన్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది మాత్రం ఇప్పటికి సస్పెన్సే. రాంచరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ కు అజయ్ దేవగన్ కూడా తోడైతే జాతీయ వ్యాప్తంగా ఈ చిత్రం మరింత పెద్దదిగా మారుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ వార్త గురించి అధికారిక ప్రకటన విడుదలయ్యేవరకు వేచి చూడాల్సిందే. మరో వైపు విలన్ పాత్రలో కన్నడ హీరో యశ్ పేరు వినిపిస్తోంది.

 అన్నదమ్ములుగా

అన్నదమ్ములుగా

ఆర్ఆర్ఆర్ చిత్ర కథ గురించి అనేక వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర సమరం 1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఈ చిత్రంలో చరణ్, ఎన్టీఆర్ అన్నా దమ్ములుగా కనిపించనున్నారట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X