‘రైడ్’ ట్రైలర్: రియల్ స్టోరీతో... సినిమా అదిరిపోయేలా ఉంది!
Recommended Video

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న చిత్రం 'రైడ్'. 1981లో లక్నోలో జరిగిన కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒక పవర్‌ఫుల్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్ అదుర్స్
తాజాగా విడుదలైన ‘రైడ్' ట్రైలర్ అదిరిపోయే విధంగా ఉంది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది వీక్షించారు. గవర్నమెంట్ ఆఫీసర్లు వెళ్లడానికి భయపడే అవినీతి పరులను ఓ ఇన్ కం టాక్స్ ఆఫీసర్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చిత్ర కథ. 7 ఏళ్ల వ్యవధిలో 49 సార్లు ట్రాన్స్‌ఫర్ అయిన పవర్ ఫుల్ ఆఫీసర్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించబోతున్నారు.

రాజ్ కుమార్ గుప్తా
గతంలో అమీర్, నో వన్ కిల్డ్ జెస్సికా లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ కుమార్ గుప్తా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఓంకారా, దృశ్యం, ఎయిర్ లిఫ్ట్, బాబీ చిత్ర నిర్మాతలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఇలియానా
గతేడాది అజయ్ దేవగన్‌తో ‘బాద్ షా హో' చిత్రంలో నటించిన ఇలియానా... మరోసారి ఆయనకు జోడీగా ‘రైడ్' చిత్రంలో కనిపించబోతోంది. అజయ్-ఇలియానా మధ్య కెమిస్ట్రీ తెరపై మరింత రంజుగా చూపించబోతున్నారు.

విడుదల తేదీ ఖరారు
మార్చి 16వ తేదీన ‘రైడ్' చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. పానోరమా స్టూడియోస్, టి-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











